టీకా కోసం నన్ను బెదిరిస్తున్నారు.. జాబితాలో సీఎంలు, పలువురు వ్యాపారవేత్తలు : అదర్ పూనావాలా

దిశ, వెబ్‌డెస్క్ : ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి తీవ్రరూపం దాల్చిన విషయం తెలిసిందే. నిన్న ఒక్కరోజే నాలుగు లక్షలకు పైగా కేసులు నమోదవడంతో దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన నెలకొంది. ఓవైపు దేశంలోని అన్ని ఆస్పత్రుల్లో కరోనా రోగులు క్యూ కడుతున్నారు. కొన్ని చోట్ల ఆక్సిజన్ సిలిండర్లు, బెడ్లు అందుబాటులో లేక వేల సంఖ్యలో రోగుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. మరోవైపు వ్యాక్సిన్ కొరత డిమాండ్‌కు తగ్గ సప్లయ్ లేకపోవడంతో కరోనా రోగుల్లో మరింత ఆందోళన […]

Update: 2021-05-01 20:13 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి తీవ్రరూపం దాల్చిన విషయం తెలిసిందే. నిన్న ఒక్కరోజే నాలుగు లక్షలకు పైగా కేసులు నమోదవడంతో దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన నెలకొంది. ఓవైపు దేశంలోని అన్ని ఆస్పత్రుల్లో కరోనా రోగులు క్యూ కడుతున్నారు. కొన్ని చోట్ల ఆక్సిజన్ సిలిండర్లు, బెడ్లు అందుబాటులో లేక వేల సంఖ్యలో రోగుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. మరోవైపు వ్యాక్సిన్ కొరత డిమాండ్‌కు తగ్గ సప్లయ్ లేకపోవడంతో కరోనా రోగుల్లో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలోనే ఇండియాలో పెద్ద మొత్తంలో కోవీషీల్డ్ వ్యాక్సిన్ సరఫరా చేస్తున్న సీరం ఇనిస్టిట్యూట్ కంపెనీ సీఈవో అదర్ పూనావాలా సంచలన వ్యాఖ్యలు చేశారు.

కోవిషీల్డ్ టీకా సరఫరా విషయంలో తనకు బెదిరింపుకాల్స్ వస్తున్నాయని, నాపై తీవ్ర ఒత్తిడి ఉందన్నారు. బెదిరించిన వారిలో పలువురు సీఎంలు, ప్రముఖ వ్యాపారవేత్తలు ఉన్నట్లు పేర్కొన్నారు. యూకేలో ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పూనావాలా ఈ వ్యాఖ్యలు చేయడం కలకలం సృష్టిస్తోంది. తనపై ఒత్తిళ్ల కారణంగానే లండరన్‌కు వచ్చినట్లు వెల్లడించారు. విదేశాల్లోనూ టీకా ఉత్పత్తి చేసే యోచనలో ఉన్నట్లు సీరం అధినేత ప్రకటించారు.

Tags:    

Similar News