టిక్‌టాక్‌కు అమెరికా షాక్ ..?
దిశ, వెబ్‌డెస్క్ : చైనాకు చెందిన టిక్‌టాక్ సహా 59కంపెనీల యాప్స్‌ను ఇండియా నిషేధించిన విషయం విదితమే.. తాజాగా చైనాతో ఇంటర్ లింక్ ఉన్న యాప్స్‌ను కూడా మనదేశం బ్యాన్ చేసింది. తాజాగా అదే బాటలో అమెరికా నడవాలని చూస్తోంది. చైనీస్ యాప్ టిక్ టాప్ పై నిషేధం విధించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. అమెరికా పౌరుల సమాచారాన్ని టిక్‌టాక్ సహా పలు యాప్స్ చైనాకు చేరవేస్తున్నాయని ఆయన ఆరోపించారు. చైనా యాప్స్‌ను […]
దిశ, వెబ్‌డెస్క్ :
చైనాకు చెందిన టిక్‌టాక్ సహా 59కంపెనీల యాప్స్‌ను ఇండియా నిషేధించిన విషయం విదితమే.. తాజాగా చైనాతో ఇంటర్ లింక్ ఉన్న యాప్స్‌ను కూడా మనదేశం బ్యాన్ చేసింది. తాజాగా అదే బాటలో అమెరికా నడవాలని చూస్తోంది. చైనీస్ యాప్ టిక్ టాప్ పై నిషేధం విధించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. అమెరికా పౌరుల సమాచారాన్ని టిక్‌టాక్ సహా పలు యాప్స్ చైనాకు చేరవేస్తున్నాయని ఆయన ఆరోపించారు. చైనా యాప్స్‌ను ఎప్పటికీ నమ్మలేమని వాటి ద్వారా చైనా కమ్యూనిస్టు పార్టీ గూఢచర్యానికి పాల్పడుతోందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.