అవసరమైతే ఆమరణ నిరాహారదీక్షకు కూడా సిద్ధం..

దిశ, ఆలేరు: పాడి రైతుల సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు కూడా సిద్ధంగా ఉన్నానని కాంగ్రెస్ పార్టీ ఆలేరు నియోజకవర్గ ఇంచార్జి బీర్ల ఐలయ్య తెలిపారు. గురువారం హయత్ నగర్‌లో‌ని మదర్ డైరీ(నార్ముల్) వద్ద బీర్ల అయిలయ్య ఆధ్వర్యంలో 200 వందల మంది పాడి రైతులతో కలసి ఒక్కరోజు నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బీర్ల అయిలయ్య మాట్లాడుతూ.. కేసీఆర్ పాడి రైతులకు ఇస్తానన్న నాలుగు రూపాయల ప్రోత్సాహకం ఇవ్వాలని, […]

Update: 2021-12-02 05:30 GMT
ailayya
  • whatsapp icon

దిశ, ఆలేరు: పాడి రైతుల సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు కూడా సిద్ధంగా ఉన్నానని కాంగ్రెస్ పార్టీ ఆలేరు నియోజకవర్గ ఇంచార్జి బీర్ల ఐలయ్య తెలిపారు. గురువారం హయత్ నగర్‌లో‌ని మదర్ డైరీ(నార్ముల్) వద్ద బీర్ల అయిలయ్య ఆధ్వర్యంలో 200 వందల మంది పాడి రైతులతో కలసి ఒక్కరోజు నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బీర్ల అయిలయ్య మాట్లాడుతూ.. కేసీఆర్ పాడి రైతులకు ఇస్తానన్న నాలుగు రూపాయల ప్రోత్సాహకం ఇవ్వాలని, ప్రమాదంలో చనిపోయిన పశువులకు ఇన్సూరెన్స్ చెల్లించాలని అన్నారు. అలాగే మదర్ డైరీ‌లో అక్రమాలకు పాల్పడి డబ్బులు దండుకుంటున్న వారి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News