18 నెలల బాలుడికి ప్రెగ్నెన్సీ.. డెలివరీ చేసిన డాక్టర్లు

దిశ, వెబ్‌డెస్క్ : సహజంగా మహిళలే గర్భం దాల్చుతారు. పురుషులు చాలా అరుదుగా ప్రెగ్నెన్సీ అయిన ఘటనలు ఉన్నాయి. అయితే ఓ 18 నెలల బాలుడి కడుపులో పిండం పెరగడం అందరిని ఆశ్చర్యంలోకి నెట్టింది. గత కొద్ది రోజులుగా బాలుడి కడుపు పెరుగుతుండడంతో పరీక్షించిన డాక్టర్లు.. గర్భం దాల్చినట్లు నిర్ధారించారు. ఈ వింత ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నేపాలీ సంతతికి చెందిన ఓ కుటుంబం మహారాష్ట్రలోని పూణెలో నివాసం ఉంటుంది. ఆ కుటుంబానికి చెందిన […]

Update: 2021-03-12 07:44 GMT

దిశ, వెబ్‌డెస్క్ : సహజంగా మహిళలే గర్భం దాల్చుతారు. పురుషులు చాలా అరుదుగా ప్రెగ్నెన్సీ అయిన ఘటనలు ఉన్నాయి. అయితే ఓ 18 నెలల బాలుడి కడుపులో పిండం పెరగడం అందరిని ఆశ్చర్యంలోకి నెట్టింది. గత కొద్ది రోజులుగా బాలుడి కడుపు పెరుగుతుండడంతో పరీక్షించిన డాక్టర్లు.. గర్భం దాల్చినట్లు నిర్ధారించారు. ఈ వింత ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

నేపాలీ సంతతికి చెందిన ఓ కుటుంబం మహారాష్ట్రలోని పూణెలో నివాసం ఉంటుంది. ఆ కుటుంబానికి చెందిన మహిళ 18 నెలల క్రితం మగబిడ్డకు జన్మనిచ్చింది. కొద్దిరోజులు బాగానే ఉన్నప్పటికీ ఇటీవల బాలుడి కడుపు లావు కావడం ప్రారంభమైంది. అలా రోజురోజుకు దాని సైజు పెరిగిపోతుండడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు. చిన్నారికి శరీర సోనోగ్రపీ, సిటి స్కాన్ తీసిన వైద్యులు సంచలన విషయాలు వెల్లడించారు. శిశువు కడుపులో కాలేయం, కుడి మూత్రాశయం మధ్యలో పిండం పెరుగుతుందని తెలిపారు. అంతేకాదు.. పిండానికి కాళ్లు, వేళ్లు, చర్మం, జుట్టు, ఎముకలతోపాటు ఇతర అవయవాలు ఏర్పడ్డట్టు చెప్పారు. పెద్ద రక్త నాళాలకు అనుసంధామై.. ఈ పిండం పెరుగుతున్నట్లు గుర్తించారు. బాలుడి ప్రాణాలు నిలవాలంటే పిండం తొలగించాలని తెలిపారు.

పింప్రి ఆస్పత్రి పీడియాట్రిక్ సర్జరీ విభాగం అధిపతి డాక్టర్ ప్రణబ్ జాదవ్ ఆధ్వర్యంలో వైద్యబృందం ఆరుగంటలు శ్రమించి పిండాన్ని తొలగించారు. పిండం 550 గ్రాముల బరువు ఉందని తెలిపారు. దీని వల్లనే బాలుడికి పోషకాహారం అందలేదని చెప్పారు. శిశువు తల్లికి రెండు పిండాలు ఏర్పడ్డాయని, పిండాలలో ఒకటి మరొక పిండం లోనికి వెళ్లినప్పుడు ఈ పరిస్థితి ఏర్పడిందని డాక్టర్ ప్రణబ్ జాదవ్ పేర్కొన్నారు. శిశువు పుట్టిన తరువాత అతడి కడుపులో పిండం పెరుగుతూ వచ్చిందని, ఇలాంటి ఘటనలు ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 200 నమోదయ్యాయని వివరించారు. ఐదు లక్షల మంది పిల్లల్లో ఒకరు ఇలాంటి అరుదైన ఘటన జరుగుతుందని చెప్పారు. దీనిని వైద్య పరిభాషలో ‘ఫిటస్ ఇన్ ఫెటు’ అంటారని వివరించారు. ప్రస్తుతం బాలుడు ఆరోగ్యంగానే ఉన్నాడని డాక్టర్ ప్రణబ్ జాదవ్ వెల్లడించారు.

Tags:    

Similar News