నాగబాబుకు ప్రకాశ్ రాజ్ కౌంటర్

దిశ, వెబ్ డెస్క్: మెగా బ్రదర్‌ నాగబాబు, విలక్షణ నటుడు ప్రకాష్‌‌రాజ్‌ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పూటకు ఓ మాట మారుస్తున్నారని.. ఆయన ఓ ఊసరవెల్లి అంటూ ప్రకాశ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు పవన్ సోదరుడు నాగబాబు. ప్రజలు, పార్టీకి దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్లు చెప్పారు. బీజేపీ ఏమి చేసినా తప్పు అనడం సరికాదన్నారు. ప్రకాశ్ లాంటి వాళ్లు ఎంతవాగినా […]

Update: 2020-11-28 12:11 GMT

దిశ, వెబ్ డెస్క్: మెగా బ్రదర్‌ నాగబాబు, విలక్షణ నటుడు ప్రకాష్‌‌రాజ్‌ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పూటకు ఓ మాట మారుస్తున్నారని.. ఆయన ఓ ఊసరవెల్లి అంటూ ప్రకాశ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు పవన్ సోదరుడు నాగబాబు. ప్రజలు, పార్టీకి దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్లు చెప్పారు. బీజేపీ ఏమి చేసినా తప్పు అనడం సరికాదన్నారు. ప్రకాశ్ లాంటి వాళ్లు ఎంతవాగినా బీజేపీ, జనసేన విజయాన్ని ఆపలేరని.. జాగ్రత్తగా మాట్లాడితే మంచిదని నాగబాబు హెచ్చరించారు.

తాజాగా నాగబాబు చేసిన కామెంట్స్‌కి రిప్లై ఇస్తూ ప్రకాష్‌‌రాజ్‌ ట్వీట్‌ చేశారు. ‘గౌరవనీయులైన నాగబాబుగారికి, మీ తమ్ముడు మీద ఉన్న ప్రేమ నాకు అర్థం అయ్యింది. నాకు దేశం మీద ఉన్న ప్రేమని మీరు అర్థం చేసుకోండి. నాకు తెలుగు భాష వచ్చు. కానీ, మీ భాష రాదు..’’ అని చేతులు జోడించి నమస్కరిస్తున్న ఎమోజీలను పోస్ట్ చేశారు.

Tags:    

Similar News