సభ అందరిది అని జగదీశ్ రెడ్డి అంటే తప్పేమిటి..? మాజీ మంత్రి తలసాని

సభ అందరిది అని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అంటే తప్పేమిటని, కాంగ్రెస్ డై వర్షన్ పాలిటిక్స్ చేస్తోందని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

Update: 2025-03-13 16:54 GMT
సభ అందరిది అని జగదీశ్ రెడ్డి అంటే తప్పేమిటి..? మాజీ మంత్రి తలసాని
  • whatsapp icon

దిశ, తెలంగాణ బ్యూరో: సభ అందరిది అని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అంటే తప్పేమిటని, కాంగ్రెస్ డై వర్షన్ పాలిటిక్స్ చేస్తోందని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అసెంబ్లీ లోపలే కాదు బయట మీడియా పాయింట్ దగ్గర మాట్లాడకుండా కాంగ్రెస్ సభ్యులు వరసగా ప్రసంగాలు చేస్తున్నారని అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ ప్రాగంణంలో గురువారం ఆయన మాట్లాడారు. జగదీశ్ రెడ్డి ప్రసంగం మొదలైందో లేదో అపుడే కాంగ్రెస్ సభ్యులు అల్లరి మొదలు పెట్టారని అన్నారు.

జగదీశ్ రెడ్డి స్పీకర్ ను ఎక్కడా అవమానపరచ లేదని తెలిపారు. దళితుడనే స్పీకర్ ను అవమానించారని కాంగ్రెస్ సభ్యులు అనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని అన్నారు. స్పీకర్ గా ప్రసాద్ కుమార్ ఎన్నిక ఏకగ్రీవం కావడానికి బీఆర్ఎస్ సహకరించిందని గుర్తు చేశారు. స్పీకర్ ను స్పీకర్ గా గౌరవిస్తున్నాం అని అన్నారు. ప్రతిపక్ష నేత ఛాంబర్ మార్చి మమ్మల్ని అవమానపరిచినా మేము పెద్దగా పట్టించుకోలేదని తెలిపారు. జగదీశ్ రెడ్డి ని సస్పెండ్ చేయాలని దురుద్దేశ పూరితంగా కాంగ్రెస్ సభా పక్షం ప్రయత్నిస్తోందని అన్నారు. అధికార పక్షమే సభా సంప్రదాయాలు మంట గలిపి నెపాన్ని మాపై నెడితే సహించేది లేదని హెచ్చరించారు.


Similar News