ఎంపీలకు ప్రగ్యా సింగ్ ఠాకూర్ యోగా పాఠాలు

న్యూఢిల్లీ: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21న బీజేపీ ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాకూర్ తోటి ఎంపీలందరికీ యోగా పాఠాలు చెప్పనున్నారు. పార్లమెంటు సెక్రటేరియట్ నిర్వహించే కార్యక్రమంలో ఆమె పాల్గొని ఆన్‌లైన్‌లో లెక్చర్ ఇవ్వబోతున్నట్టు ఓ అధికారిక ప్రకటన వెల్లడించింది. 21న మధ్యాహ్నం 12 గంటలకు ‘యోగ: ఎ వే ఆఫ్ లైఫ్’పై ప్రసంగించనున్నట్టు తెలిపింది. యోగా ఇన్‌స్ట్రక్టర్ అమీ దేశాయ్ ఫస్ట్ సెషన్ ప్రారంభిస్తారని వివరించింది. యోగా ప్రాక్టికల్ సెషన్స్, లెక్చర్‌ల గురించి […]

Update: 2021-06-18 08:47 GMT

న్యూఢిల్లీ: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21న బీజేపీ ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాకూర్ తోటి ఎంపీలందరికీ యోగా పాఠాలు చెప్పనున్నారు. పార్లమెంటు సెక్రటేరియట్ నిర్వహించే కార్యక్రమంలో ఆమె పాల్గొని ఆన్‌లైన్‌లో లెక్చర్ ఇవ్వబోతున్నట్టు ఓ అధికారిక ప్రకటన వెల్లడించింది. 21న మధ్యాహ్నం 12 గంటలకు ‘యోగ: ఎ వే ఆఫ్ లైఫ్’పై ప్రసంగించనున్నట్టు తెలిపింది. యోగా ఇన్‌స్ట్రక్టర్ అమీ దేశాయ్ ఫస్ట్ సెషన్ ప్రారంభిస్తారని వివరించింది. యోగా ప్రాక్టికల్ సెషన్స్, లెక్చర్‌ల గురించి ఎంపీలకు ఓ బులెటిన్‌లో లోక్‌సభ సెక్రటేరియట్ తెలిపింది.

Tags:    

Similar News