ఆ ఫ్యామిలీస్‌లో పుడితేనే బాలీవుడ్ చాన్స్‌లు : ప్రాచీ దేశాయ్
దిశ, సినిమా : టెలివిజన్ యాక్ట్రెస్‌గా 2006లో కెరియర్ స్టార్ చేసిన ప్రాచీ దేశాయ్.. ప్రస్తుతం బాలీవుడ్ హీరోయిన్‌గా సెటిల్ అయిపోయింది. ఈ క్రమంలో ‘రాక్ ఆన్, వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై, బోల్ బచ్చన్, అజార్’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించిన ప్రాచీ, 2016 తర్వాత బిగ్ స్క్రీన్‌పై కనిపించలేదు. ప్రస్తుతం మనోజ్ బాజ్‌పాయ్ ‘సైలెన్స్.. కెన్ యు హియర్ ఇట్’ మూవీ ద్వారా కమ్ బ్యాక్ ఇస్తున్న ఆమె.. తను […]
దిశ, సినిమా : టెలివిజన్ యాక్ట్రెస్‌గా 2006లో కెరియర్ స్టార్ చేసిన ప్రాచీ దేశాయ్.. ప్రస్తుతం బాలీవుడ్ హీరోయిన్‌గా సెటిల్ అయిపోయింది. ఈ క్రమంలో ‘రాక్ ఆన్, వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై, బోల్ బచ్చన్, అజార్’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించిన ప్రాచీ, 2016 తర్వాత బిగ్ స్క్రీన్‌పై కనిపించలేదు. ప్రస్తుతం మనోజ్ బాజ్‌పాయ్ ‘సైలెన్స్.. కెన్ యు హియర్ ఇట్’ మూవీ ద్వారా కమ్ బ్యాక్ ఇస్తున్న ఆమె.. తను ఎందుకు బిజీ హీరోయిన్ కాలేకపోయిందనే విషయాన్ని వివరించింది.
తను టీవీ ఆర్టిస్ట్‌గా బిజీగా ఉన్న సమయంలో సినిమాల కోసం టెలివిజన్ కళాకారులను పరిగణలోకి తీసుకునేవారు కాదని తెలిపింది. అందుకే సీరియల్ యాక్టర్స్ వెయిట్ అండ్ వాచ్ గేమ్ ఆడుతున్నట్లు అనిపించేదని చెప్పింది. సినీ కుటుంబాలకు చెందిన వారు మాత్రమే బాలీవుడ్ మూవీస్‌లో కనిపించడం మరో కారణం అయ్యుండొచ్చని అభిప్రాయపడింది. తను ఒక ప్రైవేట్ వ్యక్తినని, తనను తాను మార్కెట్ చేసుకోలేకపోయానని తెలిపిన ప్రాచీ.. ఇండస్ట్రీ పీపుల్‌కు కనెక్ట్ కావడంలో సక్సెస్ కాకపోవడం వల్లే చాన్స్‌లు రాలేదని తెలిపింది.