‘స్వశక్తితో ఎదిగిన వ్యక్తుల జీవితాలు స్ఫూర్తి దాయకం’
దిశ, వెబ్‌డెస్క్: స్వశక్తితో ఎదిగిన వ్యక్తుల జీవితాలు స్ఫూర్తి దాయకంగా నిలుస్తాయని శాంతా బయోటిక్ అధినేత పద్మ విభూషన్ డాక్టర్ వరప్రసాద్ రెడ్డి అన్నారు. ఆదివారం జలవిహార్‌లో జరిగిన ప్రబుద్ధ భారత్ ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిక్కీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన నర్రా రవికుమార్‌ను ఆయన ఘనంగా సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ… పేద బలహీన వర్గాల అభివృద్ధిలో డిక్కీ కృషి అభినందనీయం అని అన్నారు. ఎస్సీ ఎస్టీకమీషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ… దళిత, […]
దిశ, వెబ్‌డెస్క్: స్వశక్తితో ఎదిగిన వ్యక్తుల జీవితాలు స్ఫూర్తి దాయకంగా నిలుస్తాయని శాంతా బయోటిక్ అధినేత పద్మ విభూషన్ డాక్టర్ వరప్రసాద్ రెడ్డి అన్నారు. ఆదివారం జలవిహార్‌లో జరిగిన ప్రబుద్ధ భారత్ ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిక్కీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన నర్రా రవికుమార్‌ను ఆయన ఘనంగా సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ… పేద బలహీన వర్గాల అభివృద్ధిలో డిక్కీ కృషి అభినందనీయం అని అన్నారు. ఎస్సీ ఎస్టీకమీషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ… దళిత, గిరిజనులను పారిశ్రామికంగా అభివృద్ధిలోకి తెస్తున్న డిక్కీ సేవలు అభినందనీయం అన్నారు. ఈ సందర్భంగా చీఫ్ సెక్రటరీ ప్రదీప్ చంద్ర, కలెక్టర్ గంధం చంద్రుడు, డిక్కీ ఫౌండర్ ప్రెసిడెంట్ మిళిండ్ కాంబ్లీ, వైస్ ప్రెసిడెంట్ రాజా, రాహుల్ కిరణ్, PSN మూర్తి, అరుణ, కృష్ణవేణి, బీసీ మాజీ కమీషన్ చైర్మన్ బిఎస్ రాములు, విమలక్క, ఝాన్సీ తడిరులు పాల్గొని నర్రా రవికుమార్‌ను ఘనంగా సన్మానించారు.