ప్రాణాలు పోతున్న పట్టించుకోని అధికారులు.. స్పందించిన సర్పంచ్

దిశ, పరిగి: గుంతలు పడి రోడ్డు ప్రమాదకరంగా మారిన ఆర్ అండ్ బీ అధికారులు కనీసం పట్టించుకోలేదు. దీనితో ప్రజల ఇబ్బందులను చూడలేక ఓ మహిళా సర్పంచ్ గుంతల్లో మట్టిని పోయించారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం తొండపల్లి మీదుగా షాద్ నగర్ వెళ్లే రోడ్డు కల్వర్టు వద్ద పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. ఇవి ప్రయాణికులకు చాలా ఇబ్బందిగా మారాయి. ప్రమాదకరంగా మారిన గుంతల్లో తొండపల్లి గ్రామ సర్పంచ్ మోముల గీత స్పందించి సోమవారం వాటిలో […]

Update: 2021-12-20 09:52 GMT

దిశ, పరిగి: గుంతలు పడి రోడ్డు ప్రమాదకరంగా మారిన ఆర్ అండ్ బీ అధికారులు కనీసం పట్టించుకోలేదు. దీనితో ప్రజల ఇబ్బందులను చూడలేక ఓ మహిళా సర్పంచ్ గుంతల్లో మట్టిని పోయించారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం తొండపల్లి మీదుగా షాద్ నగర్ వెళ్లే రోడ్డు కల్వర్టు వద్ద పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. ఇవి ప్రయాణికులకు చాలా ఇబ్బందిగా మారాయి. ప్రమాదకరంగా మారిన గుంతల్లో తొండపల్లి గ్రామ సర్పంచ్ మోముల గీత స్పందించి సోమవారం వాటిలో ఎర్రమట్టి పోయించారు. తొండపల్లి కల్వర్టు, ఇతరప్రాంతాల్లో మట్టిని పోసి గుంతలను చదును చేసినట్లు తొండపల్లి కాంగ్రెస్ నాయకులు మోముల హన్మంత్ రెడ్డి తెలిపారు. గుంతల్లో పడి ప్రాణాలు పోతున్నా, కాళ్లు చేతులు విరుగుతున్నా అధికారులు పట్టించుకోక పోవడం విచారకరమన్నారు.

Tags:    

Similar News