పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్.. రూ.1500లతో 35 లక్షలు పొందడిలా
దిశ, వెబ్‌డెస్క్: కొత్త సంవత్సరంలో మంచి లాభం వచ్చే పథకాలలో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నారా. మీ పెట్టుబడి సురక్షితంగా ఉండాలని అనుకుంటున్నారా. అయితే మీకోసమే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి పోస్టాఫీసు మంచి లాభాన్ని ఇచ్చే ఒక పథకాన్ని తెచ్చింది. అదే గ్రామ సురక్ష పథకం (Gram Suraksha Scheme) . ఈ పథకం కింద ప్రతి నెలా రూ.1500 పెట్టుబడి పెట్టడం వలన రూ.35 లక్షలు పొందొచ్చు. ఈ పథకంలో చేరడానికి వయస్సు 19 నుంచి […]
దిశ, వెబ్‌డెస్క్: కొత్త సంవత్సరంలో మంచి లాభం వచ్చే పథకాలలో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నారా. మీ పెట్టుబడి సురక్షితంగా ఉండాలని అనుకుంటున్నారా. అయితే మీకోసమే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి పోస్టాఫీసు మంచి లాభాన్ని ఇచ్చే ఒక పథకాన్ని తెచ్చింది. అదే గ్రామ సురక్ష పథకం (Gram Suraksha Scheme) . ఈ పథకం కింద ప్రతి నెలా రూ.1500 పెట్టుబడి పెట్టడం వలన రూ.35 లక్షలు పొందొచ్చు. ఈ పథకంలో చేరడానికి వయస్సు 19 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలి. 19 ఏళ్ళ నుంచి ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించి రూ.10 లక్షల పాలసీని కొనుగోలు చేస్తే 55 ఏళ్లకు రూ.1515, 58 ఏళ్లకు రూ.1463, 60 ఏళ్లకు రూ.1411 నెలవారీ ప్రీమియం చెల్లిస్తారు. 55 ఏళ్ళ తరువాత విత్‌డ్రా చేస్తే, ఇన్వెస్టర్‌కు రూ.31.60 లక్షలు వస్తాయి. 58 ఏళ్ళ తర్వాత విత్‌డ్రా చేస్తే రూ.33.40 లక్షలు లభిస్తాయి. 60 ఏళ్ళ తర్వాత విత్‌డ్రా చేస్తే ఇన్వెస్టర్‌కు రూ.34.60 లక్షలు మెచ్యూరిటీ పొందవచ్చు.
ఈ పథకం కింద అదనంగా జీవిత బీమా ప్రయోజనాన్ని పొందవచ్చు. ఈ పథకంలో పెట్టుబడిని త్రైమాసిక, అర్ధ వార్షిక, వార్షిక ప్రాతిపదికన పెట్టుబడి పెట్టవచ్చు.19 నుంచి 55 సంవత్సరాల వయస్సు గల భారతీయ పౌరులు ఎవరైనా దీనిలో పెట్టుబడి పెట్టవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో, 30 రోజుల గ్రేస్ పీరియడ్ అనుమతించబడుతుంది. పెట్టుబడి పెట్టిన రోజు నుండి, 3 సంవత్సరాల తర్వాత పాలసీని సరెండర్ చేయవచ్చు. అత్యవసర పరిస్థితి ఏర్పడే వరకు, వినియోగదారులు పాలసీని సరెండర్ చేయడం మంచిది కాదు. పెట్టుబడిదారుడి మరణం తర్వాత నామినీకి లేదా చట్టపరమైన వారసుడికి డబ్బు చెల్లించబడుతుంది. ఆదాయపు పన్ను చట్టం, 1960 లోని సెక్షన్ 80c, సెక్షన్ 88 కింద పన్ను ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. ఈ పథకం కింద హామీ ఇవ్వబడిన కనీస ప్రయోజనం రూ. 10,000 నుంచి రూ.10 లక్షల మధ్య ఉంటుంది. పూర్తి వివరాల కోసం సమీపంలోని పోస్టాఫీసును సంప్రదించగలరు.