ఖండాంతరాలు దాటి.. ఒక్కటైన ధృవ్ జూలీ

దిశ, ఫీచర్స్: ఫ్యాక్ట్ చెక్, ఎక్స్‌ప్లనేటరీ వీడియోలకు ప్రసిద్ధి చెందిన భారతీయ యూట్యూబర్ ధృవ్ రాథీ.. జర్మన్‌కు చెందిన జూలీతో ఏడేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. వీరిద్దరి వివాహం నవంబర్ 24న ఆస్ట్రియా, వియన్నాలోని బెల్వెడెరే ప్యాలెస్‌లో జరగ్గా.. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. జర్మనీలో నివసిస్తున్న ధృవ్ 2014లో తొలిసారి జూలీని కలిశాడు. యాదృచ్ఛికంగా అదే సంవత్సరం తన యూట్యూబ్ ఛానెల్‌ ప్రారంభించాడు. ప్రస్తుతం ఆ ఛానెల్‌కు 6.28 మిలియన్ సబ్‌స్క్రైబర్స్ […]

Update: 2021-11-30 08:39 GMT

దిశ, ఫీచర్స్: ఫ్యాక్ట్ చెక్, ఎక్స్‌ప్లనేటరీ వీడియోలకు ప్రసిద్ధి చెందిన భారతీయ యూట్యూబర్ ధృవ్ రాథీ.. జర్మన్‌కు చెందిన జూలీతో ఏడేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. వీరిద్దరి వివాహం నవంబర్ 24న ఆస్ట్రియా, వియన్నాలోని బెల్వెడెరే ప్యాలెస్‌లో జరగ్గా.. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

జర్మనీలో నివసిస్తున్న ధృవ్ 2014లో తొలిసారి జూలీని కలిశాడు. యాదృచ్ఛికంగా అదే సంవత్సరం తన యూట్యూబ్ ఛానెల్‌ ప్రారంభించాడు. ప్రస్తుతం ఆ ఛానెల్‌కు 6.28 మిలియన్ సబ్‌స్క్రైబర్స్ ఉండటం విశేషం. ఇక ఐదేళ్ల పాటు స్నేహితులుగాఉన్న వీరిద్దరూ 2019లో వాలెంటైన్స్ డే సందర్భంగా తమ ప్రేమను వ్యక్తం చేసుకున్నారు. ఇదే క్రమంలో తొలిసారిగా తమ ఫొటోను పబ్లిక్‌గా పంచుకోవడంతో తమ లవ్‌మ్యాటర్ ఫాలోవర్స్‌ను ఆకట్టుకుంది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి పలు దేశాలకు ప్రయాణించాలనుకుని తమ పేరు మీద మరో యూట్యూబ్ ఛానెల్‌ ప్రారంభించారు. ఇందులో ట్రావెల్, లైఫ్‌స్టైల్ వ్లాగ్స్ షేర్ చేసేవారు.

‘మా పెళ్లికి కేవలం కుటుంబ సభ్యులు, స్నేహితులను మాత్రమే ఆహ్వానించాను. మేము కలుసుకున్న ఏడేళ్ల తర్వాత ఇద్దరం ఒక్కటయ్యాం. మా పెళ్లి రోజుకు సంబంధించిన చిన్న వీడియో త్వరలోనే రాబోతోంది. మాకు అభినందనలు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు!’ అంటూ ధృవ్ పేర్కొన్నాడు.

Tags:    

Similar News