మా గోస ప్రభుత్వానికి పట్టదా..?
దిశ, న్యూస్‌బ్యూరో: లాక్‌డౌన్‌లో ఎవరూ ఆకలితో ఉండొద్దన్న రాష్ట్ర పాలక వర్గానికి ఆకలితో అలమటిస్తున్న నిరుపేదల గోడు వినిపించడం లేదా…? తెల్ల రేషన్ కార్డుకు నోచుకొని లక్షలాది పేద కుటుంబాల కష్టాలపై ఊసేత్తడం లేదు. రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకొని ఏండ్లు గడుస్తున్నా.. కార్డులు ముంజూరు చేయడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కబెట్టింది. ఇప్పుడేమో రేషన్ కార్డు లేనిదే బియ్యం ఇచ్చేది లేదనడంతో నిరుపేద కుటుంబాల పరిస్థితి దిక్కుతోచని స్థితికి చేరింది. దీంతో రేషన్ కార్డుకు అర్హతగల […]
దిశ, న్యూస్‌బ్యూరో: లాక్‌డౌన్‌లో ఎవరూ ఆకలితో ఉండొద్దన్న రాష్ట్ర పాలక వర్గానికి ఆకలితో అలమటిస్తున్న నిరుపేదల గోడు వినిపించడం లేదా…? తెల్ల రేషన్ కార్డుకు నోచుకొని లక్షలాది పేద కుటుంబాల కష్టాలపై ఊసేత్తడం లేదు. రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకొని ఏండ్లు గడుస్తున్నా.. కార్డులు ముంజూరు చేయడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కబెట్టింది. ఇప్పుడేమో రేషన్ కార్డు లేనిదే బియ్యం ఇచ్చేది లేదనడంతో నిరుపేద కుటుంబాల పరిస్థితి దిక్కుతోచని స్థితికి చేరింది. దీంతో రేషన్ కార్డుకు అర్హతగల వారందరికీ తాత్కాలిక రేషన్ కార్డులు ఇచ్చి.. వారిని ఆపత్కాల పరిస్థితుల నుంచి గట్టెక్కించాలని విపక్షాలు ప్రభుత్వాని డిమాండ్ చేస్తున్నాయి. కరోనా వైరస్ (కొవిడ్ -19) నియంత్రణలో భాగంగా లాక్‌డౌన్ విధించడంతో రాష్ట్రంలో లక్షలాది మంది నిరుపేద కుటుంబాలు తినడానికి తిండిలేక నానా అవస్థలు పడుతున్నాయి. ఈ సమయంలో రాష్ట్రంలో ఆకలితో ఎవరూ ఉండొద్దని ప్రభుత్వం మాటలు చెబుతున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో మాత్రం అమలుకు నోచుకోవడం లేదు.
తెల్ల రేషన్ కార్డులకు అర్హతగల 5.60 లక్షల మంది కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు చేసుకొని ఏండ్లు గడుస్తున్నా.. వారికి కార్డులు మంజూరు చేయకుండా పౌర సరఫరాల శాఖ వద్ద పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇక తెల్ల రేషన్ కార్డులకు అర్హలైనవారు దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ గత ఏడాది నుంచి ఆన్ లైన్‌లో దరఖాస్తులు తీసుకోకపోవడంతో దరఖాస్తు చేసుకోవడానికి నోచుకోని వారు 4.50 లక్షల మంది వరకూ ఉన్నట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు అందిస్తున్న మనిషికి 12 కిలోల ఉచిత బియ్యం, ప్రతి కుటుంబానికి రూ.1500 నగదు బదిలీలు.. రేషన్ కార్డులకు అర్హతగల నిరుపేద కుటుంబాలకు అందడం లేదు. రాష్ట్రంలో రేషన్ కార్డులకు అర్హులైన 10 లక్షల మంది కడు పేదరికంలో జీవనం సాగిస్తున్నవారే. కానీ, ప్రభుత్వం రేషన్ కార్డు లేనిది బియ్యం ఇవ్వడం లేదు.
తాత్కాలిక కార్డులు ఇచ్చి ఆదుకోవాలి..
రాష్ట్రంలో రేషన్ కార్డులకు అర్హులైన వారందరికీ తాత్కాలిక రేషన్ కార్డులు అందజేసి.. లాక్‌డౌన్‌లో ప్రభుత్వం పేద ప్రజలకు అందిస్తున్న ఉచిత బియ్యం, రూ.1500 నగదు బదిలీని వారందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని విపక్షాలు ప్రభుత్వాని డిమాండ్ చేస్తున్నాయి.
దరఖాస్తు చేసి రెండేండ్లు గడుస్తోన్నది..
‘రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసి రెండేండ్లు గడుస్తున్నా.. నేటికీ కార్డు రాలేదు. లాక్‌డౌన్ సందర్భంగా ప్రభుత్వం పేదలకు అందిస్తున్న ఉచిత బియ్యం, నగదు బదిలీ రూ.1500లు కూడా మాకు ఇవ్వడం లేదు. మొదట ఆధార్ కార్డు నెంబర్ ఉంటే బియ్యం డబ్బులు ఇస్తామన్నారు. వీఆర్ఓకు ఆధార్ నెంబర్ ఇచ్చి పది రోజులు గడుస్తుంది. ఇప్పటి వరకూ ఏమీ చెప్పడం లేదు. బియ్యమైన ఇస్తారేమోనని రేషన్ షాపు వద్దకు వస్తే రేషన్ కార్డు లేనిది బియ్యం ఇవ్వడం లేదు. మూడు వారాల నుంచి పనులు లేక చేతిల రూపాయి కూడా లేదు. ఇంట్ల బియ్యం గింజలు లేవు. కొనడానికి డబ్బలు లేక ప్రభుత్వం ఇచ్చే బియ్యంతోనైనా పూటగడపుదామంటే ప్రభుత్వం ఇచ్చేట్టు లేదు.. మా ఆకలి తీరేట్టులేదు’ అని రంగారెడ్డి జిల్లా కుంట్లూరు గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి ఆవేదన చెందుతున్నాడు.
నా పేరు తొలగించారు.. కానీ,..
‘మూడు ఏండ్ల క్రితం నాకు పెళ్లైంది. దీంతో మా తల్లిదండ్రుల కార్డు నుంచి డివైడ్ చేసి కొత్త రేషన్ కార్డు ఇవ్వాలని దరఖాస్తు చేసుకొని ఏడాదిన్నార కావస్తోంది. రేషన్ కార్డు రాలేదు. కానీ, మా తల్లిదండ్రుల రేషన్ కార్డు నుంచి నా పేరును తొలగించారు. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. లాక్‌డౌన్ ముందు కారు డ్రైవింగ్ చేసి జీవనం సాగించేంది. 25 రోజుల నుంచి పనిలేదు. తినడానికి తిండి గింజలు లేవు. దీంతో ప్రభుత్వం ఉచిత బియ్యం ఇస్తాదేమోనని రేషన్ షాపుకు వస్తే బియ్యం ఇవ్వడం లేరు. ఆధార్ కార్డు నెంబర్ తీసుకున్నారు ఎప్పుడు ఇస్తారో ఏమో..!’ అని నిజామాబాద్ కు చెందిన రమేష్ అనే క్యాబ్ డ్రైవర్ అన్నాడు.
tags: ration cards, rice, coronavirus, lockdown,government,civil supply
slug:
photo: Whatsap