‘బాంబే బేగమ్స్’ను ఆపలేరు : పూజా భట్

దిశ, సినిమా : బాలీవుడ్ నటి పూజా భట్ నటించిన ‘బాంబే బేగమ్స్’ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్‌‌కు సిద్ధంగా ఉంది. మార్చి 8న విడుదల కాబోతున్న ఈ సిరీస్.. భారతదేశంలో ఐదుగురు మహిళలు వారి ఆశయాన్ని నెరవేర్చుకునే క్రమంలో ఎదుర్కొన్న వ్యక్తిగత సంక్షోభం, దుర్భలత్వం గురించి వివరించనుండగా.. ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఈ క్రమంలో కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన ఓటీటీ నిబంధనల గురించి ప్రశ్నించగా, పూజా భట్ తనదైన రీతిలో సమాధానమిచ్చింది. రూల్స్, రెగ్యులేషన్స్ అనేవి కొత్తేమీ కాదని, […]

Update: 2021-03-06 07:13 GMT

దిశ, సినిమా : బాలీవుడ్ నటి పూజా భట్ నటించిన ‘బాంబే బేగమ్స్’ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్‌‌కు సిద్ధంగా ఉంది. మార్చి 8న విడుదల కాబోతున్న ఈ సిరీస్.. భారతదేశంలో ఐదుగురు మహిళలు వారి ఆశయాన్ని నెరవేర్చుకునే క్రమంలో ఎదుర్కొన్న వ్యక్తిగత సంక్షోభం, దుర్భలత్వం గురించి వివరించనుండగా.. ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఈ క్రమంలో కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన ఓటీటీ నిబంధనల గురించి ప్రశ్నించగా, పూజా భట్ తనదైన రీతిలో సమాధానమిచ్చింది.

రూల్స్, రెగ్యులేషన్స్ అనేవి కొత్తేమీ కాదని, జీవితమంతా నిబంధనలతో వ్యవహరిస్తూనే ఉన్నామని తెలిపింది. ఎట్ ద ఎండ్.. మనని ఎవరైతే రెగ్యులేట్ చేస్తున్నారో వారితో కమ్యూనికేట్ కావడం ఫిల్మ్ మేకర్‌ బాధ్యత అని అభిప్రాయపడింది. తన మైండ్, హార్ట్‌లో ఎప్పుడూ రెగ్యులేటర్ లేదా సెన్సార్ బోర్డ్ ఉంటుందని, తనకు రైట్ అనిపించిందే తెరమీదకు తెస్తానని, అందుకోసం చివరిశ్వాస వరకు పోరాడేందుకు సిద్ధంగా ఉంటానంది పూజా భట్. వాస్తవానికి కలహాలు, నిబంధనలు మన కథను కొత్త మార్గాల ద్వారా చెప్పేందుకు ముందుకు రావాలని సూచిస్తాయని, మన కథను మనకు నచ్చిన విధంగా చెప్పేందుకు అడ్డుపడాలంటే నిబంధనలకు మించినది మరేదైనా ఉండాలంది.

Tags:    

Similar News