Prabhas: హైదరాబాద్‌కు కేంద్రమంత్రి.. ప్రభాస్‌తో కీలక భేటీ!

సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు మృతి నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు..

Update: 2022-09-14 07:21 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు మృతి నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎల్లుండి( ఈనెల 16) ఉదయం హైదరాబాద్‌లోని ప్రభాస్ ఇంటికి రాజ్‌నాథ్ సింగ్ రానున్నారని సమాచారం. బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన కృష్ణం రాజు గారికి బీజేపీ పార్టీ తరపున ఆయన కుటుంబ సభ్యులకు కేంద్ర మంత్రి సంతాపం తెలపనున్నారు. ఇప్పటికే కృష్ణంరాజు మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సంతాపం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు తెలుగు రాష్ట్రాల బీజేపీ నాయకులు కూడా కృష్ణంరాజు మృతి పట్ల సంతాపం తెలిపారు. కొందరు అంత్యక్రియలకు కూడా హాజరయ్యారు. కాగా, సెప్టెంబర్ 11వ తేదీన నటుడు కృష్ణంరాజు తెల్లవారుజామున 3:25 గంటల సమయంలో చికిత్స పొందుతూ ఏఐజి హాస్పిటల్‌లో మృతి చెంది సినీ తెలుగు సినీ ఇండస్ట్రీకి తీవ్ర విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చ‌ద‌వండి : #NTR30' కోసం భారీగా పెంచేసిన రష్మిక

Also Read : మాస్ మహరాజ్ సరసన చాన్స్ కొట్టేసిన అనుపమ

Tags:    

Similar News