నేటి నుంచి మునుగోడులో Revanth Reddy.. దొరకని ఎంపీ కోమటిరెడ్డి!
దిశ, డైనమిక్ బ్యూరో: మునుగోడు ఉపఎన్నికలో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాలను రచిస్తున్నది. శనివారం నుంచి మన మునుగోడు.
దిశ, డైనమిక్ బ్యూరో: మునుగోడు ఉపఎన్నికలో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాలను రచిస్తున్నది. శనివారం నుంచి మన మునుగోడు.. మన కాంగ్రెస్ పేరుతో గ్రామాల బాట పట్టనుంది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను శుక్రవారం ఉదయం విడుదల చేశారు. ఇటీవల కరోనా బారిన పడ్డ రేవంత్ రెడ్డి తాజాగా కోలుకున్నారు. ఇప్పటి వరకు ఆయన మునుగోడుపై వీడియో సందేశాలకే పరిమితమయ్యారు. శనివారం మునుగోడు పర్యటనకు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సిద్ధమయ్యారు. ఒకే రోజు 5 మండలాల్లో పాదయాత్రకు ప్లాన్ చేశారు. దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా మునుగోడు నియోజకవర్గంలో 176 గ్రామాలలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు తెలంగాణలోని అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ జెండాలు ఎగురవేసి, రాజీవ్ గాంధీ చిత్ర పటానికి నివాళులు అర్పించనున్నారు. ఈ నెల 21 నుంచి మండలాల వారీగా రేవంత్‌రెడ్డి పర్యటించనున్నారు. ఈ మేరకు టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా "మన మునుగోడు-మన కాంగ్రెస్" పోస్టర్‌ను విడుదల చేశారు.
సీనియర్లకు ఆహ్వానం
మునుగోడుకు తరలిరావాలని టీపీసీసీ తరపున సీనియర్లకు సమాచారం పంపించారు. సీఎల్పీ నేత భట్టితోపాటుగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ మంత్రి జానారెడ్డి, దామోదర రాజనర్సింహా, ప్రచార కమిటీ కన్వీనర్ మధుయాష్కీతో సహా పలువురిని రావాలని కోరారు. అయితే, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాత్రం ఫోన్లో దొరకలేదు. ఏఐసీసీ ఆదేశిస్తేనే మునుగోడులో ప్రచారం నిర్వహిస్తానని ఇప్పటికే ఆయన ప్రకటించారు.
ఇవి కూడా చదవండి :
రేవంత్ ఎఫెక్ట్.. మునుగోడు రూప్ మ్యాప్ చేంజ్ చేసిన కేసీఆర్?
మునుగోడు సభకు హైదరాబాద్ జనం.. 2 వేల కార్లతో భారీ కాన్వాయ్