రేణు దేశాయ్ యూటర్న్ వెనక బడా డైరెక్టర్, జాతీయ నేత..?

ఒకప్పటి హీరోయిన్‌గా, పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా రేణు దేశాయ్ తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది.

Update: 2023-08-24 13:01 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఒకప్పటి హీరోయిన్‌గా, పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా రేణు దేశాయ్ తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టాక ఆమె మరింత వెలుగులోకి వచ్చింది. రాజకీయ ప్రత్యర్థులకు రేణు దేశాయ్ ఓ అస్త్రంగా మారింది. జనసేనానిని విమర్శించాలంటే సమయం, సందర్భం ఏదైనా మూడు పెళ్లీల టాపిక్ ఎత్తడం ప్రత్యర్థులకు ఆనవాయితీగా మారింది. పెళ్లై ఇద్దరు పిల్లలు జన్మించిన తర్వాత పవన్- రేణు దేశాయ్‌తో విడాకులు తీసుకున్నారు. అయితే రేణు దేశాయ్ సైతం పరోక్షంగా పవన్‌పై అప్పుడప్పుడు కోపంగా కామెంట్స్ చేస్తూనే ఉన్నది.

అయితే, హఠత్తుగా ఇటీవల రేణు దేశాయ్ పవన్‌పై ప్రేమను కురిపించింది. మాజీ భర్తకు సపోర్ట్‌గా ఓ వీడియోని రిలీజ్ చేసి సంచలనం సృష్టించింది. తన యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన ఆ వీడియోలో.. పొలిటికల్ లీడర్‌గా పవన్ కళ్యాణ్ సమాజానికి ఉపయోగపడతారని, పిల్లల్ని, కుటుంబాన్ని వదులుకుని ప్రజల కోసం ఆయన రాజకీయాల్లోకి వచ్చారని రేణు ఆ వీడియోలో తెలిపింది. అయితే ఆమె హఠత్తుగా యూటర్న్ తీసుకోవడం వెనక పెద్ద వ్యూహమే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఓ సినీ డైరెక్టర్, ఓ జాతీయ నేత కలిసి పవన్‌కు రాజకీయంగా రూట్ క్లియర్ చేస్తున్నట్లు తెలుస్తోంది.


వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ, టీడీపీ కలిసి పోటీ చేసేందుకు సన్నద్ధం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ ప్రత్యర్థులకు ఛాన్స్ ఇవ్వకుండా రేణు దేశాయ్‌తో ప్రకటనలు చేయించినట్లు ప్రచారం జరుగుతోంది. దీని వెనక టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, సీనియర్ దర్శకుడు రాఘవేందర్ రావు ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇటీవల రాఘవేందర్ రావు మనవడు, రేణు దేశాయ్ కుమారుడు అకీరా అమెరికాలోని ఓ యాక్టింగ్ స్కూల్‌లో చేరారు. మరోవైపు దర్శకేంద్రుడు చంద్రబాబు నాయుడికి మధ్య మంచి రిలేషన్ షిప్ ఉంది. దీనిని వారిద్దరు రాజకీయంగా వాడుకుని పవన్ కళ్యాణ్‌పై ఉన్న మచ్చను తొలగించే ప్రయత్నం చేస్తున్నారని, మూడు పెళ్లీల అంశం రాజకీయం చేయకుండా రేణు దేశాయ్‌తో చెక్ పెట్టించాలనే వ్యూహంలో భాగంగానే ఆమెతో ఈ కామెంట్స్ చేయించినట్లు అటు ఫిల్మ్ నగర్, ఇటు ఏపీ పాలిటిక్స్‌లో ప్రచారం జరుగుతోంది. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాలంటే రేణు దేశాయ్ స్పందించాల్సిందే.

Tags:    

Similar News