చేతులు జోడించి అడుగుతున్న ఇలాంటి వాళ్లకు దయచేసి ఓట్లు వెయ్యకండి.. సంచలనంగా మారిన పూనమ్ వీడియో
జనతాదళ్ సెక్యూరల్ (జేడీఎస్) అధినేత దేవెగౌడ మనుమడు ప్రజ్వల్ రేవన్నపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.
దిశ, సినిమా: జనతాదళ్ సెక్యూరల్ (జేడీఎస్) అధినేత దేవెగౌడ మనుమడు ప్రజ్వల్ రేవన్నపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ అసభ్యకర వీడియో కేసుకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు కర్ణాటక ముఖ్యమంతి సిద్ధరామయ్య తన X ఖాతా ద్వారా తెలియజేశారు. ఇక ప్రస్తుతం రాజకీయపరంగా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్న ఈ విషయంపై ప్రముఖ నటి, మహిళా హక్కుల కార్యకతర్ పూనమ్ కౌర్ స్పందించింది.
ఈ మేరకు ‘2800 మందికి పైగా మహిళలను బెదిరించి లైగింక వేధింపులకు గురి చేసి అసభ్యకర వీడియోలు తీశాడు రేవన్న. ఇప్పుడు జర్మనీకి పారిపోయాడు. అతనికి డబ్బు, పలుకుబడి ఉంది. అందుకే ప్రభుత్వం ఆయన్ని ఏం చెయ్యలేక పోతుంది. పబ్లిక్ అతడినిపై తిరగబడనంతవరకు అతనికి శిక్ష పడుతుందని చెప్పలేం. అంతే కాకుండా భారత మహిళలు అందరికీ చేతులు జోడించి అడుగుతున్నా.. వారికి మాత్రమే కాదు.. మహిళల మీద ప్రేమ ఉన్న పురుషులను కూడా వేడుకుంటున్న. దయచేసి ఇలాంటి ఆరోపణలు, కేసులు ఉన్నవారికి అసలు ఓట్లు వేయకండి’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
Read More...
స్టార్ కిడ్ అయిన నన్నే రూమ్ బుక్ చేస్తా వస్తావా అని అడిగాడు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్