Pawan Kalyan : రాజకీయాల్లోకి రావడానికి కారణం ఇదే!

సినిమాల్లో స్టార్‌ హీరోగా అద్భుతంగా రాణిస్తున్న పవన్ కల్యాణ్ అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన విషయం తెలిసిందే.

Update: 2023-01-05 06:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: సినిమాల్లో స్టార్‌ హీరోగా అద్భుతంగా రాణిస్తున్న పవన్ కల్యాణ్ అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. 2014 లోనే పార్టీ స్థాపించినా మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేయలేదు. అనంతరం వచ్చిన 2019 ఎన్నికల్లో పోటీచేసి రెండు స్థానాల్లోనూ ఘోర ఓటమి చవిచూశాడు. ఓటమితో రాజకీయాలకు గుడ్‌బై చెప్పి మళ్లీ సినిమాల్లోకి వస్తాడని అంతా అనుకున్నారు. కానీ, పవన్ కల్యాణ్‌ ఓటమిని ఈజీగా అంగీకరించి రాజకీయాల్లో చరుగ్గా పాల్గొంటున్నాడు. అయితే, పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి రావడానికి బలమైన కారణం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇటీవల నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తున్న అన్‌స్టాపబుల్ షోలో పవన్ కల్యాణ్ రివీల్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు విస్తృతమయ్యాయి. అగ్ర హీరోగా అద్భుతంగా సాగుతున్న ప్రయాణాన్ని వదిలి.. అసలు రాజకీయాల్లోకి రావాలని ఎందుకు రావాలనిపించింది అని బాలయ్య పవన్‌ను ప్రశ్నించారు. దీనికి పవన్ సమాధానమిస్తూ.. ''రాజకీయాల్లోకి రావడానికి కారణం ఒకరు తప్పు చేస్తుంటే అది తప్పు అని చెప్పకపోవడం కూడా తప్పే అని నా ఫీలింగ్. అందుకే రాష్ట్రం తప్పుదారిన వెళుతున్నప్పుడు నిర్ణయించుకున్నాను. రాష్ట్ర అభివృద్ధిని, రాష్ట్ర ప్రజల భవిష్యత్‌ను నేను సామాజిక బాధ్యతగా తీసుకోవాలనుకున్నాను. అందుకే పార్టీ పెట్టాను'' పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

Full View

 ఇంకా చదవండి :  ఆంక్షలపై వాళ్లిద్దరూ సేమ్ టు సేమ్! 

Tags:    

Similar News