బీజేపీకి గుడ్‌బై.. BRSతో పొత్తుకు JanaSena సై?

టీడీపీ అటీడీపీ అధినేత చంద్రబాబును పవన్ కల్యాణ్​కలవగానే పొత్తులపై రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది.ధినేత చంద్రబాబును పవన్ కల్యాణ్​కలవగానే పొత్తులపై రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది.

Update: 2023-01-10 05:06 GMT

దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ అధినేత చంద్రబాబును పవన్ కల్యాణ్​కలవగానే పొత్తులపై రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. రెండు పార్టీలు బీజేపీతో దోస్తీ కడతాయా? లేక కేసీఆర్ ​బీఆర్‌ఎస్‌తో జత కడతాయా అనేది చర్చనీయాంశమైంది. ఈ నేతలిద్దరి ఇటీవల కలయిక సందర్భంగా తాము బీజేపీకి ఎంత దగ్గరో బీఆర్‌ఎ‌కూ అంతే దగ్గరన్నట్లు సంకేతాలిచ్చారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు కలిసి ఉద్యమిస్తామని నేతలిద్దరూ ప్రకటించారు. ఇప్పుడు బాబు, పవన్‌ల​ద్వయం కలిసి మీరు ఆ గట్టో.. ఈ గట్టో తేల్చుకోండంటూ బంతిని బీఆర్‌ఎస్, బీజేపీ కోర్టులోకి విసిరినట్టుంది. ఎన్నికలు సమీపించే దాకా బీజేపీ ఏమీ తేల్చకపోవచ్చు. అప్పటిదాకా పొత్తుల దాగుడు మూతలాటలు కొనసాగుతూనే ఉంటాయని పరిశీలకులు భావిస్తున్నారు.

పొత్తులపై ఊహాగానాలు

ఎవరు ఎక్కడెక్కడ ఎన్నెన్ని సీట్లు పోటీ చేయాలనేది చర్చించినట్లు ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. అసలు ఎవరితో కలిసి ముందుకు సాగాలనేది స్పష్టత లేకుండా అప్పుడే సీట్ల పంపకాల గురించి చర్చించే అవకాశం లేదు. బీఆర్‌ఎస్​రాకతో తమ రెండు పార్టీలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ముందుగానే స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో టీడీపీ, జనసేన నుంచి వలసలు ఆగిపోవచ్చు. కేసీఆర్‌తో పవన్‌కు ఉన్న బంధం బీజేపీతో ఉన్న దానికన్నా ఎక్కువే. అందువల్ల ఇప్పుడు బీఆర్‌ఎస్‌ను ముందు పెట్టి పొత్తుల సంగతి తేల్చమని బీజేపీని అడిగే అవకాశాలున్నాయి. బీజేపీ అంగీకరించకుంటే బీఆర్‌ఎస్‌తో కలిసి ముందుకు సాగే అవకాశం లేకపోలేదు.

పాలి'ట్రిక్స్'కు చెక్?

ఇప్పటిదాకా బీజేపీ కేంద్ర పెద్దలు రాష్ట్రంలోని మూడు పార్టీలతో ఆడుతున్న రాజకీయ క్రీనీడకు త్వరలోనే ఫుల్​స్టాప్ ​పడొచ్చు. బీఆర్​ఎస్​రాకతో రాజకీయాలు మరింత వేడెక్కాయి. రాష్ట్ర ప్రభుత్వం జీవో 1 జారీ చేసి ప్రతిపక్షాలపై నల్ల చట్టాలను మోపుతున్నాయంటూ ఆక్రోశిస్తున్నాయి. రోడ్ షోలు, బహిరంగ సభలకు సరైన బందోబస్తు పెట్టకుండా ప్రజల్లో విపక్షాలను బద్నాం చేస్తున్నదని ప్రభుత్వంపై కన్నెర్ర జేస్తున్నాయి. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోన్న ప్రభుత్వ వైఖరిపై అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలని చంద్రబాబు, పవన్​ పిలుపునిచ్చారు. దీంతో వైసీపీకి వ్యతిరేకంగా ఉన్న అన్ని పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావాలనే ఎత్తుగడను తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఇలా కూడా బీజేపీ పెద్దలపై ఒత్తిడి తీసుకురావడానికి చంద్రబాబు, పవన్​ ఉమ్మడి కార్యాచరణను ప్రకటించే అవకాశముందని పరిశీలకులు అంటున్నారు.

త్వరలో బీఆర్ఎస్ బహిరంగ సభలు

సంక్రాంతి తర్వాత బీఆర్‌ఎస్ కార్యకలాపాలు ముమ్మరం చేయనున్నట్టు కేసీఆర్ ​ఈపాటికే ప్రకటించారు. తొలుత విశాఖ, తిరుపతిలో బహిరంగ సభలు ఏర్పాటు చేయొచ్చని సమాచారం. అంతకన్నా ముందే బీఆర్​ఎస్‌ను తాము ఆహ్వానిస్తున్నట్లు చంద్రబాబు, పవన్​ప్రకటించినందున బీజేపీతో సానుకూలంగా ఉన్న వైసీపీ నుంచి వలసలను కేసీఆర్ ​ప్రోత్సహించవచ్చు. ఇప్పటికీ రాష్ట్రంలో సగానికిపైగా ఓట్లతో బలంగా ఉన్న వైసీపీని టార్గెట్​ చేయకుండా బీఆర్​ఎస్​ బలపడే అవకాశం లేదు. అందుకే తెలివిగా ఇద్దరు నేతలు బీఆర్‌ఎస్​ తుపాకీని బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న వైసీపీ మీదకు గురి పెట్టేట్లు ప్రకటనలు చేశారు. వైసీపీని ఓడించేందుకు అన్ని పార్టీలనూ ఏకం చేయాలనే చంద్రబాబు, పవన్​ ఎత్తుగడలతో చివరకు వీళ్ల జాతీయ పార్టనర్​ బీఆర్​ఎస్సా.. లేక బీజేపీనా? అనేది ఎన్నికలు సమీపించేదాకా తేలకపోవచ్చు.

Also Read...

పొత్తులపై BRS స్కెచ్ అదేనా! 

Tags:    

Similar News