ఎన్నికల వేళ కర్ణాటక ప్రభుత్వాన్ని కుదిపేస్తున్న నేహా హత్య కేసు
కర్ణాటకలోని ఓ ప్రముఖ కాలేజీ క్యాంపస్లో తనను ప్రేమించడంలేదని ఫయాజ్ యువకుడు నేహా హిరేమత్ అనే విద్యార్థినిని దారుణంగా అందరూ చూస్తుండగానే కత్తితో పొడిచి హత్య చేశాడు.
దిశ, వెబ్డెస్క్: కర్ణాటకలోని ఓ ప్రముఖ కాలేజీ క్యాంపస్లో తనను ప్రేమించడంలేదని ఫయాజ్ యువకుడు నేహా హిరేమత్ అనే విద్యార్థినిని దారుణంగా అందరూ చూస్తుండగానే కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ హత్యకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియో యువతి వెంటపడ్డ ఫయాజ్.. తనతో పాటు తెచ్చుకున్న కత్తితో అతి క్రూరంగా పొడిచి పొడిచి చంపడం కనిపించింది. ఈ ఘటన ఒక్కసారిగా కర్ణాటక రాష్ట్రంలో సంచలనంగా మారింది. అయితే దీనిపై కాంగ్రెస్ మంత్రులు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అగ్గి రాజేశాయి. ఆ యువతి ఇంతకు ముందు ఫయాజ్ ను ప్రేమించిందని.. ఇప్పుడు అతన్ని కాదని మరో వ్యక్తితో మాట్లాడుతుందనే కోపంతో ఈ ఘటన జరిగిందని చెప్పుకొచ్చారు.
కాగా విద్యార్థి సంఘం నాయకులు మాత్రం ఇది ముమ్మాటికి లవ్ జీహాద్ అని.. అందుకు యువతి నేహా హిరేమత్ ఒప్పుకోకపోవడంతో ఈ దారుణానికి ఒడిగట్టారని హిందూ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఆ రాష్ట్ర హోంమంత్రి ఇంటి ముందు ఏబీవీపీ, హిందూ సంఘాల నేతలు విద్యార్థులతో కలిసి రెండు రోజులుగా పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. దీంతో ఎన్నికల వేళ నేహా హిరేమత్ హత్య కేసు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టివేస్తుంది. అలాగే ఈ హత్యను నిరసిస్తూ.. శనివారం లింగాయత్ లు పెద్ద ఎత్తున్న నిరసన కార్యక్రమాలు చేపట్టారు.