Rajagopal Reddy అన్న.. తొందరపడకు: MLC Kavitha
బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత.. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కౌంటర్ ఇచ్చింది. కాగా కొద్ది సేపటి క్రితం రాజగోపాల్ రెడ్డి తన ట్విట్టర్ లో..
దిశ, డైనమిక్ బ్యూరో : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ మరో చార్జీషీట్‌లో ఎమ్మెల్సీ కవిత పేరు ప్రస్తావించడంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ కవితపై ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. 'లిక్కర్ స్కాం చార్జిషీట్‌లో లిక్కర్ క్వీన్స్ పేరు 28 సార్లు ప్రస్తావించారు' అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
దీంతో, రాజగోపాల్ రెడ్డి ట్వీట్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు. 'రాజగోపాల్ అన్న .. తొందరపడకు... మాట జారకు. 28 సార్లు నా పేరు చెప్పించినా...28 వేల సార్లు నా పేరు చెప్పించినా అబద్ధం నిజం కాదు' అంటూ కవిత ట్వీట్ చేశారు. లిక్కర్ క్వీన్ పేరు చార్జిషీట్‌లో 28 సార్లు ఉందంటూ రాజగోపాల్ ట్వీట్ చేసిన ట్వీట్ పై కవిత కౌంటర్ ఇచ్చారు.
Read More: నిజం నిప్పులాంటిది చెల్లెమ్మ.. కవితకు రాజగోపాల్ రెడ్డి కౌంటర్
Also Read....