తెలంగాణ కాంగ్రెస్‌ నేతలతో ఖర్గే భేటీ.. పార్టీ పరిస్థితులపై ఆరా!

ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గేతో టీపీసీసీ ముఖ్య నాయకుల భేటీ అయ్యారు. కర్ణాటకలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ఢిల్లీకి వెళ్తున్న ఖర్గే.. హైదరాబాద్ ఎయిర్ పోర్టులో గంటసేపు ఆగారు.

Update: 2023-03-25 15:07 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గేతో టీపీసీసీ ముఖ్య నాయకుల భేటీ అయ్యారు. కర్ణాటకలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ఢిల్లీకి వెళ్తున్న ఖర్గే.. హైదరాబాద్ ఎయిర్ పోర్టులో గంటసేపు ఆగారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్​రావు థాక్రే తదితరులతో సమీక్షించారు. పార్టీ పరిస్థితులపై ఆరా తీశారు. హథ్​సే హాథ్, పాదయాత్రలకు సంబంధించిన అప్డేట్‌ను కాంగ్రెస్ నేతలు ఖర్గేకు వివరించారు. హాథ్​సే హాథ్​యాత్రను అన్ని అసెంబ్లీ సెగ్మెంట్‌లలో నిర్వహించాలని ఖర్గే టీపీసీసీ లీడర్లకు సూచించారు.

దీంతో పాటు ప్రభావం చూపగలిగిన లీడర్లంతా పాదయాత్రలు చేస్తూ కార్యకర్తలకు, ప్రజలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేయాలన్నారు. రాహుల్​సస్పెన్షన్‌పై పోరాటం మరింత విస్తృతంగా చేయాలని ఖర్గే ఆదేశాలిచ్చినట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు శివకుమార్, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, ఏఐసీసీ కార్యదర్శి నదీమ్ జావీద్, రోహిత్ చౌదరి, మధుయాష్కీ, సంపత్ కుమార్, షబ్బీర్ అలీ, రోహిన్ రెడ్డి, హర్కర్ వేణుగోపాల్, అనిల్ యాదవ్ పాల్గొన్నారు.

Tags:    

Similar News