Sri Reddy: ఐపాక్‌కి 400 కోట్లు ఇచ్చిన జగన్.. వెలుగులోకి వాస్తవాలు..
శ్రీ రెడ్డి ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అవసరంలేదు.
దిశ వెబ్ డెస్క్: శ్రీ రెడ్డి ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అవసరంలేదు. హీరోయిన్ అవ్వాలని సినీ ఇండస్ట్రీకి వచ్చి కాలం కలిసిరాక, కాలం కలిసొచ్చే వరకు ఓపికపట్టలేక ఫిలించాంబర్ ముందు నగ్నంగా బైటాయించి అప్పట్లో నానా రభస చేసి వార్తల్లో నిలిచిన ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత కాలంలో సోషల్ మీడియాలో చేపల కూరతో నెటిజన్స్‌కు అందాల ఎరవేసి పాపులర్ అయ్యింది.
అనంతరం వైఎస్ జగన్‌కు వీరాభిమానిగా మారింది. ఈ నేపథ్యంలో వైసీపీనిగాని, వైఎస్ జగన్‌ను కాని ఎవరైనా ప్రశ్నించినా.. విమర్శించినా.. వారిపై భూతుల దాడి చేస్తుంది. అయితే 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలే పార్టీ ఓటమికి కారణం అని పలువురు నేతలను దూయ్యబట్టింది. అయితే తాజాగా వైఎస్ జగన్ ఓటమికి కారణం జగనే అంటూ.. ట్వీట్ చేసింది.
‘ఐపాక్ కి ఇచ్చిన 400 కోట్ల రూపాయల్లో కనీసం 50 కోట్లు మన కార్యకర్తలకి ఖర్చు పెట్టుంటే విజయం నీదయ్యుండేది సామి, టీడీపీ అధికారంలో ఉంటే జన్మభూమి కమిటీల ద్వారా, వేరే వేరే రూపంలో కార్యకర్తలకి సంపాదించుకునే అవకాశం ఇస్తారు.. అధికారంలో లేకపోయినా సోషల్ మీడియా సోల్జర్స్‌ని, కార్యకర్తలని పోషిస్తుంది టీడీపీ ..నువ్వు బటన్‌ని నమ్ముకున్నావ్, కార్యకర్తలు ఎండిపోయారు.
ఇప్పటికైనా నీ social మీడియాని, కార్యకర్తలని దగ్గరకి చేర్చుకో సామి. మహాసేన రాజేష్ గాడు, గాయత్రి, అనూష లాంటి పిల్లపిత్రేయిలుకి కూడా చంద్రబాబు స్టేజి మీద పక్కన నిలపెట్టుకుంటారు, మాట్లాడతారు, జీవనానికి కావాల్సిన హెల్ప్ చేస్తారు.. మన సోషల్ మీడియా, ysrcp కార్యకర్తలకి ఆ వేల్యూ ఇవ్వు సామి.. నీ దర్శనానికి వేయి కళ్ళతో ఎదురుచూస్తాం’ అంటూ ట్వీట్‌లో రాసుకు వచ్చింది.