పార్లమెంట్‌లో ఇంట్రెస్టింగ్ సీన్.. రాహుల్, ప్రధాని మోడీ షేక్ హ్యాండ్

దాదాపు దశాబ్ధ కాలం తరువాత లోక్‌సభలో తోలిసారి ప్రతిపక్ష నేత వచ్చారు.

Update: 2024-06-26 10:37 GMT

దిశ వెబ్ డెస్క్: దాదాపు దశాబ్ధ కాలం తరువాత లోక్‌సభలో తోలిసారి ప్రతిపక్ష నేత వచ్చారు. లోక్ సభలోని మొత్తం 10 శాతం సీట్లు గెలిచిన పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కుతుంది. అయితే, ఈసారి 99 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్.. ప్రతిపక్ష హోదాను దక్కించుకుంది. కాగా నేడు లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా ఎంపికైయ్యారు. దీనితో అటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్షం లోక్‌సభకు చేరుకుంది.

ఈ నేపథ్యంలో లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికైన ఓం బిర్లాను ప్రధాని మోడీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అభినందించారు. అనంతరం ఇద్దరూ కలసి ఓంబిర్లాను స్పీకర్ చైర్ వద్దకు తీసుకెళ్లేందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు.


Similar News