తవ్వకాలను నిలిపేయండి..హైకోర్టు స్టేటస్కో ఉత్తర్వులు
పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం మురికిపూడిలో గ్రానైట్తవ్వకాలను నిలిపేయాలని హైకోర్టు ఆదేశించింది. మంగళవారం స్టేటస్కో ఉత్తర్వులను జారీ చేసింది. మంత్రి రజనితోపాటు ఎంపీ అవినాష్‌రెడ్డి
దిశ, ఏపీ బ్యూరో: పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం మురికిపూడిలో గ్రానైట్తవ్వకాలను నిలిపేయాలని హైకోర్టు ఆదేశించింది. మంగళవారం స్టేటస్కో ఉత్తర్వులను జారీ చేసింది. మంత్రి రజనితోపాటు ఎంపీ అవినాష్‌రెడ్డి బంధువులు ప్రతాపరెడ్డి, శ్వేతారెడ్డి, జీవీ దినేష్‌రెడ్డి, శివ పార్వతికి నోటీసులు ఇచ్చింది. ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన డీకే పట్టాలను రద్దు చేయకుండా సదరు భూముల్లో క్వారీయింగ్చేసేందుకు ఎన్‌వోసీ ఇవ్వడంపై రైతులు హైకోర్టును ఆశ్రయించారు. 21.5 ఎకరాల్లో గ్రానైట్తవ్వకాలు చేపట్టినట్లు రైతులు పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ భూముల్లో సుమారు రూ.200 కోట్ల విలువైన గ్రానైట్నిక్షేపాలున్నట్లు న్యాయస్థానం ముందుంచారు. పిటిషన్‌దారుల అడ్వకేట్వాదనలు విన్న హైకోర్టు అనుమతులు ఇచ్చిన తహసీల్దారుతోపాటు రైతులను పనులకు వెళ్లకుండా అడ్డుకున్న ఎస్సైకి కూడా నోటీసులు జారీ చేసింది. యథాతథస్థితిని కొనసాగించాలని హైకోర్టు ఆదేశిస్తూ ఈ కేసును ఏప్రిల్10కి వాయిదా వేసింది. మంత్రితోపాటు మిగతావాళ్లు కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే..
సుమారు పదిహేనేళ్ల క్రితం మురికిపూడిలో పేదలు సాగు చేసుకునేందుకు ప్రభుత్వం అసైన్డ్భూమి ఇచ్చింది. 90 ఎకరాల్లో పేద ఎస్సీ ఎస్టీ మైనార్టీ కుటుంబాలకు బీ ఫారాలు ఇచ్చారు. అప్పటినుంచి రైతులు సదరు భూములను సాగు చేసుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇక్కడ గ్రానైట్నిక్షేపాలున్నట్లు గుర్తించింది. నాడు కొందరు టీడీపీ నేతలు ఈ భూముల్లో క్వారీయింగ్చేయాలని ప్రయత్నించారు. ఎస్సీఎస్టీలకు ఇచ్చిన భూములు కావడంతో వాటిని గనుల శాఖ తీసుకోవాలంటే పట్టాదారులకు ప్రత్యామ్నాయ భూమిని చూపించాలి. దీనికితోడు నాడు రైతులు క్వారీయింగ్‌కు ఇచ్చేది లేదని అడ్డం తిరిగారు.
ప్రభుత్వం మారిన తర్వాత ఈ భూములపై అధికార వైసీపీ నేతల దృష్టి పడింది. అనుకున్నదే తడవుగా తహసీల్దారు ఎన్‌వోసీలు మంజూరు చేశారు. గ్రానైట్క్వారీయింగ్కు యంత్రాలను దించారు. రైతులు వాళ్లను అడ్డుకున్నారు. రైతులపైకి పోలీసులను ఉసిగొల్పి భయభ్రాంతులకు గురిచేశారు. దీంతో రైతులు హైకోర్టును ఆశ్రయించారు. గత ఏడాది డిసెంబరు 27న రైతుల తరపున అడ్వకేట్వీవీ లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు. కడప ఎంపీ అవినాష్‌రెడ్డి మామ వీరప్రతాపరెడ్డి, ఎంపీ మోపిదేవి వెంకటరమణ భార్యకు చెందిన కంపెనీకి గ్రానైట్క్వారీయింగ్లీజు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు కోర్టుకు తెలిపారు. రైతులను తమ భూముల్లోకి వెళ్లకుండా రెవెన్యూ అధికారులు అడ్డుకున్నట్లు పేర్కొన్నారు. ఎస్సై స్టేషన్‌కు పిలిపించి బీ ఫారాలు సరెండర్చేయకుంటే కేసులు పెడతామని బెదిరించినట్లు న్యాయస్థానానికి నివేదించారు. మంత్రి రజనిని కలవాలని ఎస్సై చెప్పినట్లు కోర్టు దృష్టికి తెచ్చారు.
తర్వాత కొందరు పిటిషనర్లు మంత్రి విడదల రజనిని కలిశారు. బీ ఫారాలను సరెండర్చేయకుంటే రద్దు చేయిస్తానని మంత్రి హెచ్చరించినట్లు న్యాయస్థానానికి వెల్లడించారు. మంత్రి అనుచరులు బెదిరించినట్లు కోర్టుకు వివరించారు. ప్రభుత్వంలో పలుకుబడి కలిగిన వ్యక్తులు లీజు కోసం దరఖాస్తు చేయడంతో అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఎన్‌వోసీలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని మైనింగ్లీజును రద్దు చేయాలని హైకోర్టును కోరారు. రైతులను భూముల నుంచి ఖాళీ చేయించకుండా రెవెన్యూ అధికారులను అడ్డుకోవాలని అత్యున్నత న్యాయ స్థానానికి నివేదించారు. పూర్వాపరాలను పరిశీలించిన తర్వాత యథాస్థితిని కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది.