ఎంపీ గోరంట్ల న్యూడ్ వీడియో కేసును సీబీఐకు అప్పగించండి
దిశ, ఏపీ బ్యూరో : వైసీపీ ఎంపీ అసభ్య వీడియో విషయంలో అనంతపురం ఎస్పీ ఫకీరప్ప తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు నిజాన్ని దాచి గోరంట్ల మాధవ్‌ని కాపాడే ప్రయత్నం చేశారు అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు.
దిశ, ఏపీ బ్యూరో : వైసీపీ ఎంపీ అసభ్య వీడియో విషయంలో అనంతపురం ఎస్పీ ఫకీరప్ప తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు నిజాన్ని దాచి గోరంట్ల మాధవ్‌ని కాపాడే ప్రయత్నం చేశారు అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఫార్వర్డ్ చేసిన వీడియోలే ఉన్నాయని ఒరిజినల్ వీడియో దొరికితేనే తప్ప నిగ్గుతేల్చలేమని నిస్సహాయత వ్యక్తం చేయడంపై మండిపడ్డారు. ఏపీ పోలీస్ తలచుకుంటే ఈ విషయాన్ని తేల్చడం సులభమేనని అన్నారు. లేదు నిజాన్ని తేల్చడం కష్టం అన్నట్టయితే... మీ వల్ల కాదు అనుకుంటే కేసును సీబీఐకి ఇచ్చే దమ్ముందా? అదైనా చెప్పండి అని అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు.
ఎస్పీ క్లీన్ చిట్ ఇచ్చినా ఎంపీ గోరంట్ల మాధవ్‌కు తప్పని తిప్పలు..