AP Politics: ఫ్యాన్ గాలికి రేకులు రాలిన రోజా.. కమలంతో వికసించేనా..?
అదుపుతప్పిన కారు, అదుపులోని నోరు ఎప్పటికైనా ముప్పే అన్నారు పెద్దలు.
దిశ వెబ్ డెస్క్: అదుపుతప్పిన కారు, అదుపులోని నోరు ఎప్పటికైనా ముప్పే అన్నారు పెద్దలు. తగువులు మాపేదీ మాటే.. తంటాలు తెచ్చేదీ మాటే. అందుకే మాట్లాడేటప్పుడు ఆచితూచి ఆలోచించి మాట్లాడాలి. అలాకాకుండా నోరుంది కదా అని ఎలాపడితే అలా మాట్లాడితే దాని పర్యవసానం భవిష్యత్‌లో అనుభవించాల్సి వస్తుంది అనేదానికి మాజీ మంత్రి ఆర్కే రోజా నిదర్శనంగా నిలుస్తున్నారు.
తమకు మంచి చేస్తారని నమ్మి రోజాను నమ్మి ఆమెకు ఓట్లు వేసి గెలిపిస్తే.. ఆమె జగన్ అన్న అంటూ జగన్‌కు భజన చేయడానికే అధికారం ఇచ్చినట్టు వ్యవహరించారని ప్రజలతో విమర్శలు గుప్పి్ంచారు. అక్రమాలకు, అవినీతికి బ్రాండ్ ఎంబాసిడర్‌గా మారారని ప్రజలు మండిపడ్డారు. రోజా చేష్టలకు విసిగిపోయిన ఆంధ్రా ప్రజలు 2024 ఎన్నికల్లో రోజాను ఇంటికి పంపారు.
రోజా రాజకీయ ప్రస్థానం..
మాజీ మంత్రి రోజా టీడీపీలో చేరడం ద్వారా తన రాజకీయ ప్రస్తానం మొదలు పెట్టింది. అయితే ఆ తరువాత వ్యక్తిగత కారణాల చేత టీడీపీ నుండి బయటకి వచ్చారు. అనంతరం 2009 లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేకర్ రెడ్డి నేతృత్వంతో ఆమె కాంగ్రెస్‌లో చేరారు. అయితే ప్రమాదవశాత్తు వైఎస్ రాజశేకర్ రెడ్డి 2012లో మరణించారు.
కాగా వైఎస్ రాజశేకర్ రెడ్డి కుమారుడు వైఎస్ జగన్‌కు కాంగ్రెస్ పార్టీకి మధ్య తలెత్తిన విబేధాల చేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ నుండి బయటకు వచ్చి 2014లో వైసీపీని స్థాపించారు. ఈ నేపథ్యంలో రోజా సైతం కాంగ్రెస్‌కి బైబై చెప్పి వైసీపీలో చేరారు. ఈ క్రమంలో 2014 ఎన్నికల్లో వైసీపీ తరుపున నగరి నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
అలా అసెంబ్లీకి వెళ్లాలి అనే తన కోరికను నెరవేర్చు్కున్నారు. ఆ తరువాత 2019 ఎన్నికల్లో మళ్లీ నగరి నుండే పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ నేపపథ్యంలో ఆమెను పర్యాటక శాఖ మంత్రి పదవి వరించింది.
రోజాకు రాజీ తప్పదా..?
గత ప్రతిపక్ష నేతలను తిత్తడం, ప్రతిపక్ష నేతలపై వ్యక్తి గత విమర్శులు చేయండం, జగన్ భజన చేయడం తప్పా ఐదేళ్లలో పర్యాటక శాఖ మంత్రిగా రోజా రాష్ట్రానికి చేసింది ఏమీ లేదనే విమర్శలు సైతం ఎదుర్కొన్నారు. రాజ్యాంగబద్ద పదవిలో ఉన్న విషయాన్ని మరిచి సాటి మహిళలే అసహ్యించుకునేలా మాట్లాడారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్, బాలక్రిష్ణ చివరికి చంద్రబాబు కుటుంబంలోని మహిళలను సైతం ఆమె ధుయ్యబట్టారు. అధికారం శాశ్వతం అన్నట్టు ఆమె వ్యవహరించిన తీరు అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. చూరు పగ, చుట్టూ పగ అన్నట్టు అటు ప్రతిపక్షం నేతలతోనే కాదు, ఇటు సొంత పార్టీ నేతలతో సైతం సఖ్యంగా ఉండలేకపోయారు.
దీనితో 2024 ఎన్నికల్లో ఆమెకు టికెట్ ఇవ్వొద్దని, ఇచ్చినా ఆమె గెలవదని సొంత పార్టీ నేతలే జగన్‌ను కోరడం విశేషం. అయితే జగన్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా ఆమెకు టిక్కెట్ ఇచ్చారు. అయితే 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. అలానే రోజా విషయం జగన్‌కు సైతం అర్థమైనట్టుంది, 2029 ఎన్నికల్లో రోజాకు టికెట్ ఇవ్వకపోవచ్చని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఒకవేళ రోజా పార్టీ మారాలి అనుకున్నా తనకు ఆ అవకాశం లేదు, ఎందుకంటే ఆమె అంతలా ప్రతిపక్షాలను దూషించింది. కనుక జగన్ టిక్కెట్ ఇచ్చినా.. ఇవ్వకున్నా ఆమె వైసీపీలోనే ఉండాలి. అలా కాదని వేరే పార్టీలో చేరడం కాదు కదా, కనీసం ఇతర పార్టీ నేతలతో మాట్లాడే ధైర్యం కూడా చేయలేదని, ఉంటే రాజీ పడి వైసీపీలో ఉండాలి, లేదా రాజకీయాలకు స్వస్తి పలికి టీవీ షోలు చేసుకోవాల్సిందే అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
రోజా కమలంలో వికసించేనా..?
అయితే రోజా మాత్రం పార్టీ మారేందుకు పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. కేంద్ర మంత్రిగా ఎన్నికైన తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డికి రోజా x వేదికగా అభినందనలు తెలిపారు. అయితే ఏపీకి చెందిన నేతలు సైతం కేంద్రమంత్రులుగా ఎన్నికైయ్యారు. కాని ఆమె మరెవరికి అభినందనలు తెలపకపోవడం గమనార్హం. దీనితో రోజా బీజేపీ వైపు అడుగులు వేస్తుందా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.