Rahul Gandhi పై విమర్శలు చేస్తే సహించం: మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్

ఏఐసీసీ అగ్ర నేత రాహుల్ గాంధీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ విమర్శించడాన్ని జడ్చర్ల మాజీ ఎమ్మేల్యే ఎర్ర శేఖర్ ఖండించారు.

Update: 2023-07-18 14:50 GMT

దిశ, జడ్చర్ల : ఏఐసీసీ అగ్ర నేత రాహుల్ గాంధీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ విమర్శించడాన్ని జడ్చర్ల మాజీ ఎమ్మేల్యే ఎర్ర శేఖర్ ఖండించారు. టీపీసీసీ ఆదేశాల మేరకు మంగళవారం జడ్చర్ల అంబేద్కర్ చౌరస్తాలో మంత్రి కేటీఆర్ కు వ్యతిరేకంగా ధర్నా, రాస్తారోకో చేశారు. ఇందులో భాగంగా కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం ఎర్ర శేఖర్ మాట్లాడుతూ.. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని విమర్శించే నైతికత కేటీఆర్ కు లేదని అన్నారు. తెలంగాణ ఉద్యమం పేరుతో దోపిడీకి పాల్పడిన సీఎం కేసీఆర్ కుటుంబం, అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ఖజానాకు గండికొట్టారని విమర్శించారు.

తెలంగాణ అంటే కేసీఆర్ జాగీరు కాదని, ప్రజా స్వామికంగా తెలంగాణ రాష్టం ఏర్పడిందని తెలిపారు. ఇందులో విద్యార్థులు, మేధావులు, విద్యావంతులు, ఉద్యోగులు, మహిళలు సైతం పోరాడితేగాని తెలంగాణ రాలేదని, దీన్ని కేసిఆర్, కేటీఆర్ గమనించి ముందుకు సాగాలని అన్నారు. టీపీసీసీ రేవంత్ రెడ్డిని విమర్శిస్తే బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. కార్యక్రమంలో బుక్క వెంకటేశం, మీనాజ్, బుర్ల వెంకటయ్య, సర్ఫరాజ్, నిత్యానందం, ఫాహాద్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News