దూకుడు పెంచిన కాంగ్రెస్.. పార్లమెంట్ కోఆర్డినేటర్ల నియామకం
పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. ఈ ఎన్నికలను సీరియస్‌గా తీసుకున్న కాంగ్రెస్ దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల పార్లమెంట్ నియోజకవర్గాలకు కోఆర్డినేటర్లను నియమించింది.
దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. ఈ ఎన్నికలను సీరియస్‌గా తీసుకున్న కాంగ్రెస్ దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల పార్లమెంట్ నియోజకవర్గాలకు కోఆర్డినేటర్లను నియమించింది. ఏమాత్రం ఛాన్స్ తీసుకోకుండా.. కోఆర్డినేటర్లుగా సీనియర్ లీడర్లకు బాధ్యతలు అప్పగించింది. తెలంగాణ రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాలకు మంత్రులు, కీలక నేతలను నియమించింది. మహబూబ్‌నగర్, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాల బాధ్యతలను సీఎం రేవంత్ రెడ్డికి అప్పగిస్తూ ఆదివారం ఏఐసీసీ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
నియోజకవర్గాల కోఆర్డినేటర్లు:
1. చేవెళ్ల = రేవంత్ రెడ్డి
2. మహబూబ్‌నగర్ = రేవంత్ రెడ్డి
3. ఆదిలాబాద్ = సీతక్క
4. పెద్దపల్లి = శ్రీధర్ బాబు
5. కరీంనగర్ = పొన్నం ప్రభాకర్
6. నిజాబాబాద్ = జీవన్ రెడ్డి
7. జహీరాబాద్ = సుదర్శన్ రెడ్డి
8. మెదక్ = దామోదర రాజనర్సింహా
9. మల్కాజిగిరి = తుమ్మల నాగేశ్వరరావు
10. సికింద్రాబాద్ = భట్టి విక్రమార్క
11. హైదరాబాద్ = భట్టి విక్రమార్క
12. నాగర్ కర్నూలు = జూపల్లి కృష్ణారావు
13. నల్లగొండ = ఉత్తమ్ కుమార్ రెడ్డి
14. భువనగిరి = కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
15. వరంగల్ = కొండా సురేఖ
16. మహబూబాబాద్ = పొంగులేటి శ్రీనివాస రెడ్డి
17. ఖమ్మం = పొంగులేటి శ్రీనివాస రెడ్డి