మహారాష్ట్ర మాజీ సీఎంకు కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్

తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ మహారాష్ట్ర మాజీ సీఎం, ప్రస్తుత డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

Update: 2023-03-26 10:31 GMT

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ మహారాష్ట్ర మాజీ సీఎం, ప్రస్తుత డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మహారాష్ట్రకు తనను రావొద్దనడానికి మీరెవరు అంటూ ప్రశ్నించారు. మహారాష్ట్రలోని లోహలో ఆదివారం బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజైరన సీఎం కేసీఆర్..  మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ పై విరుచుకుపడ్డారు. మహారాష్ట్రలో తనకేం పని అంటూ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ప్రశ్నిస్తున్నారని, కానీ భారత పౌరుడిగా దేశంలో ఎక్కడైన తిరిగే హక్కు తనకుందని స్పష్టం చేశారు. తెలంగాణలోని తమ పథకాలను అమలు చేస్తే మహారాష్ట్రకు రానని తెలిపారు.

దమ్ముంటే రైతు బంధు, దళిత బంధు, 24 గంటల కరెంట్, రైతు బీమా వంటి పథకాలు అమలు చేసి చూపించాలని సవాలు విసిరారు. అంబేద్కర్ పుట్టిన గడ్డలో ప్రజలకు దళిత బంధు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో అమలు చేసిన పథకాలను మహారాష్ట్రలో అందిస్తే తాను అక్కడికి రానని తేల్చి చెప్పారు. దేశంలో ఎంతమంది ప్రధానులు మారినా దేశ ప్రజల ఆర్థిక స్థితి మాత్రం మారడం లేదని అన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు దాటినా దేశ పరిస్థితి ఏమాత్రం మారలేదన్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలను దేశమంతా అమలు చేయడానికే బీఆర్ఎస్ పెట్టానని స్పష్టం చేశారు. 

Tags:    

Similar News