CM Chandrababu: నేడు అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు..
గత ఐదేళ్లలో అమరావతి నిర్మాణం అగులం కూడా కదలలేదని.. వైసీపీ అధికరంలోకి వచ్చిన తరువాత అమరావతిని పట్టించుకున్న పాపాన పోలేదని, ఫలితంగా అమరావతి శిథిలా అవస్థకు చేరుకుందని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది.
దిశ వెబ్ డెస్క్: గత ఐదేళ్లలో అమరావతి నిర్మాణం అగులం కూడా కదలలేదని.. వైసీపీ అధికరంలోకి వచ్చిన తరువాత అమరావతిని పట్టించుకున్న పాపాన పోలేదని, ఫలితంగా అమరావతి శిథిలా అవస్థకు చేరుకుందని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో నేడు టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్వేతపత్రాన్ని విడుదల చేయనున్నారు. వైసీపీ పాలనలో అమరావతి పరిస్థితి ఎంత ధయనీయంగా మారిందో నేడు చంద్రబాబు ప్రజకు తెలియజేయనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి.. ప్రకటించిన చంద్రబాబు..
2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. కాగా అదే ఏడాది జరిగిన ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది దీంతో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే అప్పటివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు హైదరాబాద్ రాజధానిగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే విభజన తర్వాత 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ రెండు తెలుగు రాష్ట్రాలకు రాజధానిగా ఉండేలా ఒప్పందం కుదిరింది.
ఈ పది సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ మరో రాజధానిని ఏర్పర్చుకోవాలి లేకపోతే పది సంవత్సరాలు ముగిసిన తర్వాత హైదరాబాద్ కేవలం తెలంగాణకు మాత్రమే రాజధానిగా ఉంటుంది అని ఆ ఒప్పందంలో ఉంది. దీనితో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ప్రకటించారు. అలానే రాజధాని నిర్మాణ పనులు కూడా ప్రారంభించారు. దీనికోసం రైతుల దగ్గర నుండి భూమిని సైతం సేకరించారు.
అధికారంలోకి వైసీపీ.. అంధకారంలోకి అమరావతి..
అయితే 2019 ఎన్నికల్లో ఎవరు ఊహించని విధంగా టీడీపీ ఘోర పరాజయాన్ని చవిచూడగా.. వైసీపీ 151 సీట్లతో అధికారంలోకి వచ్చింది. దీంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి అమరావతిని పట్టించుకున్న పాపాన పోలేదు అని అటు అమరావతి రైతులు ఇటు అప్పటి ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ధ్వజమెత్తాయి. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల ప్రస్తావన తీసుకొచ్చిన విషయం అందరికీ తెలిసిందే.
అయితే మూడు రాజధానులన్న జగన్మోహన్ రెడ్డి ఒక రాజధానిని కూడా నిర్మించలేకపోయారు అని విశ్లేషకులు పేర్కొంటున్నారు. జగన్మోహన్ రెడ్డి అనాలోచిత చర్యలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి నేటికీ దశాబ్ధ కాలం గడుస్తున్నా ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
నేడు అమరావతి అంశంపై మాట్లాడనున్న సీఎం..
కాగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమి 164 సీట్లతో విజయాన్ని సాధించి అధికారంలోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. దీనితో మరోసారి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆయన గత ఐదేళ్లలో నిర్మాణానికి నోచుకోని అమరావతి దుస్థితిపై నేడు మాట్లాడనున్నట్లు తెలుస్తోంది