దిశ, వెబ్ డెస్క్: టీఎస్పీఎస్సీ పేపర్ల లీక్ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. ఇక ప్రతిపక్ష నాయకులు కూడా టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ పై మండిపడుతున్నారు. తాజాగా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్విట్టర్ వేదికగా టీఎస్పీఎస్సీ చైర్మన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జనార్ధన్ రెడ్డికి తమను మధ్య ఎలాంటి వైరం లేదని, యూనివర్సిటీలో జనార్ధన్ రెడ్డి తనకు సూపర్ సీనియర్ అని ఆర్ఎస్ ప్రవీణ్ గుర్తు చేశారు.
తాను గురుకుల సెక్రటరీగా ఉన్నప్పుడు ఉద్యోగ రీత్యా ఎన్నోసార్లు ఆయనను కలిశానని చెప్పుకొచ్చారు. కానీ టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అనేది క్షమించరాని నేరమని, అది లక్షలాది నిరుద్యోగుల భవిష్యత్తును అంధకారంలో పడేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.