మంత్రి కేటీఆర్ ది రాజకీయ వ్యభిచారం.. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు

మంత్రి కేటీఆర్ చేసేది రాజకీయ వ్యభిచారమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు ఘాటు విమర్శలు చేశారు.

Update: 2023-03-17 17:13 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : మంత్రి కేటీఆర్ చేసేది రాజకీయ వ్యభిచారమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు ఘాటు విమర్శలు చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కల్వకుంట్ల కుటుంబం తెలంగాణను గుత్తాధిపత్యంగా భావిస్తున్నారని మండిపడ్డారు. వారివి మతి లేని మాటలని, పిచ్చి చేష్టలని ఫైరయ్యారు. మంత్రి కేటీఆర్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఎప్పుడు, ఎక్కడ జైలుకు వెళ్లాడో సమాధానం చెప్పాలన్నారు. తాము ఉద్యమం చేస్తున్న సమయంలో కేటీఆర్ అనే యూజ్ లెస్ ఫెలో ఎక్కడున్నాడని ధ్వజమెత్తారు.

సీఎం కేసీఆరే తన కొడుకు, బిడ్డ తెలంగాణకు రారని చెప్పారని, మరి ఇప్పుడెందుకు వచ్చావో చెప్పాలని కాసం ప్రశ్నించారు. సంతోష్ జీపై లేనిపోని విమర్శలు చేస్తున్నారని, ఫాం హౌజ్ కేసులో మంత్రి కేటీఆర్ కోర్టుకు వెళ్లలేదా అని ఆయన గుర్తుచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు, మంత్రి కేటీఆర్ కు దమ్ముంటే ఓయూ రావాలని, అక్కడ తేల్చుకుందామని సవాల్ విసిరారు. కేటీఆర్ ఆయన చెల్లిపై ప్రేమతో ఢిల్లీకి వెళ్లాడని, ప్రశ్న పత్రాల లీకేజీ విషయంలో పట్టించుకున్నావా అని ప్రశ్నించారు. అగ్నికి ఆరుగురు ఆహుతైన వారిని పరామర్శించావా అని ఆయన నిలదీశారు.

బీజేపీ నేతలపై పిచ్చిపిచ్చిగా మాట్లాడితే నాలుక కోసేస్తామని కాసం వెంకటేశ్వర్లు హెచ్చరించారు. తాము చర్చలకే కాకుండా కొట్లాటకు సిద్ధమని, ఎక్కడికి వస్తావో చెబితే తేల్చుకుందామని కేటీఆర్ కు సవాల్ విసిరారు. కేటీఆర్ చేసేది బ్రోకరిజమని ఘాటు విమర్శలు చేశారు. ఆయన్ను బట్టలు విప్పించి కొట్టే రోజులు ఎంతో దూరం లేదని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమకారులను ఉరికించి కొట్టిన వ్యక్తి మంత్రి ఆలుగడ్డ, విగ్గు శ్రీనివాస్ యాదవ్ అని, ఆయన గురించి తాము మాట్లాడాలా అని మండిపడ్డారు. ఆయనో పత్తాల బ్యాచ్ అని ఫైరయ్యారు.

Tags:    

Similar News