బీజేపీ పార్టీలకు ఎమ్మెల్యేలను దూరం చేస్తుంది..Nitish Kumar
పాట్నా: మణిపూర్‌లో ఐదుగురు జేడీయూ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడంపై బిహార్ సీఎం, పార్టీ చీఫ్ నితీశ్ కుమార్ స్పందించారు. బీజేపీ ఎమ్మెల్యేలను పట్టుకుని, పార్టీలకు దూరం చేస్తుందని అన్నారు.
పాట్నా: మణిపూర్‌లో ఐదుగురు జేడీయూ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడంపై బిహార్ సీఎం, పార్టీ చీఫ్ నితీశ్ కుమార్ స్పందించారు. బీజేపీ ఎమ్మెల్యేలను పట్టుకుని, పార్టీలకు దూరం చేస్తుందని అన్నారు. బీజేపీ చర్యలు రాజ్యాంగబద్ధమేనా అని ప్రశ్నించారు. 'మేము ఎన్డీఏ నుండి విడిపోయినప్పుడు, మణిపూర్‌లోని మా పార్టీ ఎమ్మెల్యేలు వచ్చి మమ్మల్ని కలుసుకున్నారు. వారు జేడియూతో ఉన్నామని హామీ ఇచ్చారు. ఏమి జరుగుతుందో మనం ఆలోచించాలి. పార్టీల నుంచి ఎమ్మెల్యేలను విడగొడుతున్నారు. ఇది రాజ్యాంగబద్ధమేనా? 2024 ఎన్నికల కోసం ప్రతిపక్షాలు ఏకం కావాలి' అని మీడియాతో అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం దెబ్బతింటుందని తెలిపారు. కాగా, శుక్రవారం మణిపూర్ ఐదుగురు జేడియూ ఎమ్మెల్యేలు బీజేపీ చేరారు. అంతకుముందు అరుణాచల్ ప్రదేశ్‌లోని జేడియూ ఎమ్మెల్యే టెకి కాసో కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ తతంగం అంతా నితీశ్ కుమార్ బిహార్‌లో బీజేపీ పొత్తు వీడి, ఆర్జేడీతో చేరిన తర్వాతే చోటు చేసుకోవడం గమనార్హం.