కేసీఆర్ను కట్టేసి ‘బలగం’ సినిమాను చూపించాలి.. బండి సంజయ్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2023-04-10 12:18 GMT

దిశ, వెబ్ డెస్క్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ను కట్టేసి మరీ ‘బలగం’ సినిమాను చూపెట్టాలని అన్నారు. సోమవారం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని దేవీ థియేటర్ లో పార్టీ నేతలతో కలిసి బండి సంజయ్ బలగం సినిమా చూశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కుటుంబ గొప్పదనం గురించి సినిమాలో బాగా చూపించారని కొనియాడారు. కుటుంబ సభ్యుల మధ్య ఉండే ప్రేమానురాగాలను సినిమాలో అద్భుతంగా తెరకెక్కిచారని అన్నారు.

కుటుంబ గొప్పతనం, ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఉండే ఎమోషన్స్ వంటివేమీ కేసీఆర్ కు తెలియవని అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఆయన బిడ్డ పెళ్లి సమయంలో జైలుకు పంపారని, తననూ తన అత్త చనిపోయిన సమయంలో జైలుకు పంపారని కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. కుటుంబం అంటే ఏమాత్రం గౌరవం లేని కేసీఆర్ ను కట్టేసి ‘బలగం’ సినిమా చూపించాలని బండి సంజయ్ అన్నారు.

Read more:

సారీ.. మరోసారి జరగకుండా చూసుకుంటా.. బండి సంజయ్ అరెస్టుపై కరీంనగర్ సీపీ


Similar News