ఖర్గేతో కాంగ్రెస్​ చర్చలు.. రాహుల్​కు అండగా ఉండాలని లీడర్లకు సూచన

ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే తో టీపీసీసీ ముఖ్య నాయకుల భేటీ అయ్యారు.

Update: 2023-03-25 13:49 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే తో టీపీసీసీ ముఖ్య నాయకుల భేటీ అయ్యారు. కర్ణాటక లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ఢిల్లీకి వెళ్తున్న ఖర్గే.. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో గంటసేపు ఆగారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్​ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్​రావ్​థాక్రే తదితరులతో సమీక్షించారు. పార్టీ పరిస్థితులపై ఆరా తీశారు. హథ్​సే హాథ్​, పాదయాత్రలకు సంబంధించిన అప్డేట్​ను కాంగ్రెస్ ​నేతలు ఖర్గేకు వివరించారు. హాథ్​సే హాథ్​యాత్రను అన్ని అసెంబ్లీ సెగ్మెంట్​ లలో నిర్వహించాలని ఖర్గే టీపీసీసీ లీడర్లకు సూచించారు. 

Tags:    

Similar News