సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరిన మహారాష్ట్ర నేతలు
బీఆర్ఎస్‌లో మహారాష్ట్రకు చెందిన నేతలు చేరారు.
దిశ, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్‌లో మహారాష్ట్రకు చెందిన నేతలు చేరారు. బుధవారం ప్రగతి భవన్ లో ఔరంగాబాద్, పర్భణీ జిల్లాల్లో పట్టున్న నాయకుడు అభయ్ కైలాస్ రావు పా బుధవారం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ సమక్షంలో చేరారు. గులాబీ కండువాను కప్పి కేసీఆర్ ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తదితరులున్నారు. కాగా అభయ్ కైలాస్ రావు పాటిల్ తండ్రి కైలాస్ రావు రెండు సార్లు ఎమ్మెల్యేగా పని చేయగా.. ఆయన తాత దిగంబర్ రావు ఓ దఫా ఎమ్మెల్యేగా పని చేశారు.