బీహార్ ఎన్నికల కోసం సీట్ల సర్దుబాటు
దిశ, వెబ్‌డెస్క్: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో రాజకీయపార్టీలు గెలుపు కోసం సమాయత్తం అవుతున్నాయి. అనేక వ్యూహాలు రచిస్తూ ప్రత్యర్థుల పై ఎత్తుగడలు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నేషనల్ డెమోక్రటిక్ అలియన్స్ (NDA) బీహార్ ఎన్నికల కోసం సీట్ల సర్దుబాటు ప్రక్రియను మొదలుపెట్టింది. ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలన్న దాని పై చర్చలు జరుపుతుంది. అయితే, బీజేపీ అధినాయకత్వానికి ఎల్జేపీ అధినేత చిరాగ్ పాశ్వాన్ కూటమి నుంచి వైదోలుగుతామని లేఖ రాశాడు. పోటీ చేసే […]
దిశ, వెబ్‌డెస్క్: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో రాజకీయపార్టీలు గెలుపు కోసం సమాయత్తం అవుతున్నాయి. అనేక వ్యూహాలు రచిస్తూ ప్రత్యర్థుల పై ఎత్తుగడలు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నేషనల్ డెమోక్రటిక్ అలియన్స్ (NDA) బీహార్ ఎన్నికల కోసం సీట్ల సర్దుబాటు ప్రక్రియను మొదలుపెట్టింది. ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలన్న దాని పై చర్చలు జరుపుతుంది.
అయితే, బీజేపీ అధినాయకత్వానికి ఎల్జేపీ అధినేత చిరాగ్ పాశ్వాన్ కూటమి నుంచి వైదోలుగుతామని లేఖ రాశాడు. పోటీ చేసే స్థానాల్లో జేడీ(యూ)-ఎల్జేపీ మధ్య విబేధాలు జరుగుతున్నాయి. కాగా, ఎన్డీయే భాగస్వామిగా ఉంటూనే బీహార్ సీఎం నితీష్ పై ఎల్జేపీ నేత చిరాగ్ పాశ్వాన్ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో బీజేపీ-జేడీ(యూ) పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఇంకా కుదరలేదు. జేడీ(యూ) అభ్యర్థుల పై పోటీకి నిలబడుతామని చిరాగ్ ప్రకటించడంతో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. దీంతో తాజా చర్చల ఫలితంగా సీట్ల సర్ధుబాటు పై ఏకాభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. అక్టోబర్ 28 నుంచి నవంబర్ 7 వరకూ మూడు దశల్లో బీహార్ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.