పుదుచ్చేరిలో రాజకీయ సంక్షోభం
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో రాజకీయ సంక్షోభం నెలకొంది. వరుస రాజీనామాలతో నారాయణస్వామికి అసమ్మతి సెగ తగులుతోంది. అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాలతో సభలో బలం తగ్గింది. ఇటీవల మంత్రి నమశివాయం, ఎమ్మెల్యే తీపాయన్‌దాన్ రాజీనామా చేసి బీజేపీలో చేరారు. తాజాగా సోమవారం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు, మంగళవారం ఎమ్మెల్యే జాన్‌కుమార్ రాజీనామా చేశారు. శాసనసభలో 30 స్థానాలకు గాను, గతంలో కాంగ్రెస్ కూటమి 18 మంది సభ్యుల బలంతో నారాయణస్వామి నేతృత్వంలో ప్రభుత్వాన్ని […]
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో రాజకీయ సంక్షోభం నెలకొంది. వరుస రాజీనామాలతో నారాయణస్వామికి అసమ్మతి సెగ తగులుతోంది. అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాలతో సభలో బలం తగ్గింది. ఇటీవల మంత్రి నమశివాయం, ఎమ్మెల్యే తీపాయన్‌దాన్ రాజీనామా చేసి బీజేపీలో చేరారు. తాజాగా సోమవారం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు, మంగళవారం ఎమ్మెల్యే జాన్‌కుమార్ రాజీనామా చేశారు.
శాసనసభలో 30 స్థానాలకు గాను, గతంలో కాంగ్రెస్ కూటమి 18 మంది సభ్యుల బలంతో నారాయణస్వామి నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాగా, ప్రస్తుతం నలుగురు రాజీనామా చేయగా.. నారాయణస్వామి బలం 14కు పడిపోయింది. మరో రెండు నెలల్లో పుదుచ్చేరి శాసనసభలు ఎన్నికలు జరగనున్నాయి. పుదుచ్చేరిలో అధికారం కోసం బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, ఏడీఎంకే కలిసి పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీని కేంద్ర ప్రభుత్వం తొలగిస్తూ ఉత్వర్వులు జారీ చేసింది. ఆమె స్థానంలో తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్‌కు అదనపు బాధ్యతలను అప్పగించింది. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం నిర్ణయం తీసుకున్నట్లు న్యూస్ ఏజెన్సీ పీటీఐ మంగళవారం రాత్రి వెల్లడించింది. కాగా.. 2016 మే 22న కిరణ్ బేడిని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.