ఆందోళనలు ఆపండి… అమరవీరుల జిల్లా సాధన సమితికి హెచ్చరిక

దిశ, పరకాల: అమరవీరుల జిల్లా సాధన సమితి సభ్యులు గత కొంతకాలంగా నిర్వహిస్తున్న ఆందోళన కార్యక్రమాలను నిలిపివేయాలని పరకాల ఏసిపి శివరామయ్య విలేకర్ల సమావేశంలో ఆందోళనకారులను హెచ్చరించారు. గత నెల 28వ తేదీ నుండి వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందన్నారు. అయినప్పటికీ పరకాల అమరవీరుల జిల్లా సాధన సమితి సభ్యులు ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా హెచ్చరికలను బేఖాతరుచేస్తూ సభలు, సమావేశాలు, ధర్నాలు, రాస్తారోకోలు, బందులు, ర్యాలీలు, డప్పు చప్పుళ్లు, […]

Update: 2021-08-06 09:18 GMT

దిశ, పరకాల: అమరవీరుల జిల్లా సాధన సమితి సభ్యులు గత కొంతకాలంగా నిర్వహిస్తున్న ఆందోళన కార్యక్రమాలను నిలిపివేయాలని పరకాల ఏసిపి శివరామయ్య విలేకర్ల సమావేశంలో ఆందోళనకారులను హెచ్చరించారు. గత నెల 28వ తేదీ నుండి వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందన్నారు. అయినప్పటికీ పరకాల అమరవీరుల జిల్లా సాధన సమితి సభ్యులు ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా హెచ్చరికలను బేఖాతరుచేస్తూ సభలు, సమావేశాలు, ధర్నాలు, రాస్తారోకోలు, బందులు, ర్యాలీలు, డప్పు చప్పుళ్లు, ఊరేగింపులు నిర్వహిస్తుండడం సరైంది కాదని తెలియజేశారు.

ఇప్పటికైనా ఆందోళనకారులు పోలీసులు ముందస్తు అనుమతులు లేకుండా రోడ్లపై ముఖ్య కూడళ్ల వద్ద గుమికూడడం ప్రజా రవాణా వ్యవస్థకు ఆటంకం కలిగే విధంగా కార్యక్రమాలు నిర్వహించడం శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం అవుతుందని అలాంటి కార్యక్రమాలు రూపొందిస్తే శాంతి భద్రతల పరిరక్షణ దృశ్య కేసు నమోదు చేయడంతోపాటు చట్ట పరంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో పరకాల ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి, ఎస్ఐ ప్రశాంత్ బాబు, పిఎస్ఐ ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Tags:    

Similar News