గొప్ప పని చేస్తున్న పోలీస్ అధికారి
దిశ, వెబ్ డెస్క్: ‘నాది ప్రభుత్వం ఉద్యోగం. నేను, నా ఫ్యామిలీ బాగుంటే సరిపోతుంది. నాకు నెల కాగానే జీతం వస్తుంది. అన్నీ ఉన్నాయి.. ఇక నాకేమీ ప్రాబ్లం లేదు.. సో వారి కోసం నాకెందుకు.. సమాజం ఎటుపోతే నాకేంది’ అన్న ధోరణి కొంతమంది ప్రభుత్వ ఉద్యోగాల్లో కనపడుతది. కానీ, కొంతమంది వ్యక్తులు తాము వచ్చిన మూలాలను ఏనాడు మరిచిపోరు. వాళ్లు ఎంత బిజీగా ఉన్నా.. వాళ్లకు దొరికిన సమయంలో ఇతరులకు మంచి చేసేందుకు ప్రయత్నం చేస్తుంటారు. […]
దిశ, వెబ్ డెస్క్: ‘నాది ప్రభుత్వం ఉద్యోగం. నేను, నా ఫ్యామిలీ బాగుంటే సరిపోతుంది. నాకు నెల కాగానే జీతం వస్తుంది. అన్నీ ఉన్నాయి.. ఇక నాకేమీ ప్రాబ్లం లేదు.. సో వారి కోసం నాకెందుకు.. సమాజం ఎటుపోతే నాకేంది’ అన్న ధోరణి కొంతమంది ప్రభుత్వ ఉద్యోగాల్లో కనపడుతది. కానీ, కొంతమంది వ్యక్తులు తాము వచ్చిన మూలాలను ఏనాడు మరిచిపోరు. వాళ్లు ఎంత బిజీగా ఉన్నా.. వాళ్లకు దొరికిన సమయంలో ఇతరులకు మంచి చేసేందుకు ప్రయత్నం చేస్తుంటారు.
ఆ మంచి ఇతరులకు ఉపయోగకరంగా ఉండడంతో వారి జీవితాల్లో కూడా వెలుగులు నిండే అవకాశముంటది. తాజాగా మధ్యప్రదేశ్ లో ఇండోర్ లో ఓ పోలీస్ ఆఫీసర్ గూర్చి మనం చర్చించుకోబోతున్నాం. అదేమిటంటే.. పలాసియా పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న వినోద్ దీక్షిత్ అనే పోలీస్ అధికారి ప్రతిరోజూ తన అధికారిక విధులను పూర్తి చేసిన తరువాత రాజ్ అనే యువకుడికి పాఠాలు బోధిస్తుంటాడు.
అయితే.. ఈ విషయమై ఆ పోలీస్ ను అడగగా.. ‘ నేను పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఈ కుర్రాడు నా కంట పడ్డాడు. అతడిని ఏమిటని అడిగా. వెంటనే అతను నాకు పోలీస్ కావాలి ఉంది అని నాతో చెప్పాడు. అప్పటి నుంచి నేను అతడికి నేను ప్రతిరోజూ ఇంగ్లీష్, మ్యాథ్స్ నేర్పిస్తున్నాను” అని పోలీస్ చెప్పుకొచ్చారు. ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరూ పోలీస్ సార్ మీరు సూపర్ సార్ అంటున్నారు.