మీరు అక్కడ మద్యం తాగుతున్రా..? అయితే జాగ్రత్త!

దిశప్రతినిది, మహబూబ్ నగర్: కరోనా సాకుతో ఆంధ్రా ప్రభుత్వం మద్యం ధరలు పెంచడంతో ప్రస్తుతం ఆంధ్రా సరిహాద్దు ప్రాంతాల ప్రజలు మద్యం కోసం తెలంగాణ బాట పట్టారు. ముఖ్యంగా ఆదివారం వస్తే చాలు వీరి సంఖ్య మరింత పెరిగిపోతుంది. తెలంగాణ సరిహద్దులోని జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ కు వీరి తాకిడి కొంత అధికంగా ఉందని చెప్పాలి. పక్కనే కర్నూలు నగరం ఉండడంతో ఆదివారాలు వందల సంఖ్యలో మందుబాబులు మందు కోసం సరిహద్దు దాటుతున్నారు. మరికొంత మంది […]

Update: 2020-07-19 02:40 GMT

దిశప్రతినిది, మహబూబ్ నగర్: కరోనా సాకుతో ఆంధ్రా ప్రభుత్వం మద్యం ధరలు పెంచడంతో ప్రస్తుతం ఆంధ్రా సరిహాద్దు ప్రాంతాల ప్రజలు మద్యం కోసం తెలంగాణ బాట పట్టారు. ముఖ్యంగా ఆదివారం వస్తే చాలు వీరి సంఖ్య మరింత పెరిగిపోతుంది. తెలంగాణ సరిహద్దులోని జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ కు వీరి తాకిడి కొంత అధికంగా ఉందని చెప్పాలి. పక్కనే కర్నూలు నగరం ఉండడంతో ఆదివారాలు వందల సంఖ్యలో మందుబాబులు మందు కోసం సరిహద్దు దాటుతున్నారు. మరికొంత మంది దొడ్డిదారిన మద్యాన్ని సరిహద్దు దాటిస్తున్నారు. ఈ సందర్భంగా అదివారంను దృష్టిలో పెట్టుకొని కర్నూలు మందు బాబులపై పోలీసు నిఘా పెంచారు. అలంపూర్ చౌరాస్తాలో మందు ప్రియులపై ప్రత్యేక నిఘా బృందాల పరివేక్షణ కొనసాగుతుంది. ఎక్కువగా బహిరంగ ప్రదేశాల్లో కూర్చోని మందు త్రాగుతున్నారనే ఫిర్యాదు రావడంతో అలాంటి వారిపై దృష్టి సారించి వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. అదే సమయంలో వాహనాల రికార్డులు తనిఖీలు సైతం చేపట్టారు. కర్నూలు నుండి వచ్చే ముందు బాబుల ఆగడాలకు చెక్ పెట్టే పనిలో జిల్లా పోలీసులు పడ్డారు.

Tags:    

Similar News