లాఠీచార్జి..

         తమిళనాడు రాజధాని చెన్నైలో సీఏఏ వ్యతిరేక ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసాయి. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా శుక్రవారం అర్ధరాత్రి ముస్లిం సంఘాల నాయకులు, మహిళలు చేపట్టిన ర్యాలీకి అనుమతి లేదనే కారణంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నిరసనకారులకు, భద్రత బలగాలకు మధ్య తోపులాట జరగడంతో చేసేదేమీలేక పోలీసులు తమ లాఠీలకు పనిచెప్పారు. ఉత్తర చెన్నై, చాకలిపేటలో సీఏఏ ఆందోళనలు మిన్నంటాయి.కేంద్రం కావాలనే మతం ఆధారంగా దేశాన్ని,మనుషులను విడగొట్టాలని చూస్తోందని ముస్లిం […]

Update: 2020-02-14 22:10 GMT

తమిళనాడు రాజధాని చెన్నైలో సీఏఏ వ్యతిరేక ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసాయి. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా శుక్రవారం అర్ధరాత్రి ముస్లిం సంఘాల నాయకులు, మహిళలు చేపట్టిన ర్యాలీకి అనుమతి లేదనే కారణంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నిరసనకారులకు, భద్రత బలగాలకు మధ్య తోపులాట జరగడంతో చేసేదేమీలేక పోలీసులు తమ లాఠీలకు పనిచెప్పారు. ఉత్తర చెన్నై, చాకలిపేటలో సీఏఏ ఆందోళనలు మిన్నంటాయి.కేంద్రం కావాలనే మతం ఆధారంగా దేశాన్ని,మనుషులను విడగొట్టాలని చూస్తోందని ముస్లిం సంఘాల నాయకులు ఆరోపించారు.

Tags:    

Similar News