భారీగా గంజాయి పట్టివేత.. నలుగురు అరెస్ట్

దిశ, కోదాడ: ప్రస్తుతం తెలంగాణలో గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణా విచ్చలవిడిగా జరుగుతోన్న విషయం తెలిసిందే. ప్రభుత్వం డ్రగ్స్‌ను నిర్మూలించడంలో పూర్తిగా విఫలం అవుతోందని ప్రతిపక్షాలు రోజూ విమర్శల మీద విమర్శలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ గంజాయి అమ్మకాలు మాత్రం నిలువరించ లేకపోతోంది. తాజాగా.. సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిధిలోని రామాపురం క్రాస్‌రోడ్డు వద్ద భారీగా గంజాయి పట్టుబడింది. శుక్రవారం రాత్రి పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో 35 కిలోల గంజాయిని […]

Update: 2021-09-24 22:05 GMT

దిశ, కోదాడ: ప్రస్తుతం తెలంగాణలో గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణా విచ్చలవిడిగా జరుగుతోన్న విషయం తెలిసిందే. ప్రభుత్వం డ్రగ్స్‌ను నిర్మూలించడంలో పూర్తిగా విఫలం అవుతోందని ప్రతిపక్షాలు రోజూ విమర్శల మీద విమర్శలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ గంజాయి అమ్మకాలు మాత్రం నిలువరించ లేకపోతోంది. తాజాగా.. సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిధిలోని రామాపురం క్రాస్‌రోడ్డు వద్ద భారీగా గంజాయి పట్టుబడింది. శుక్రవారం రాత్రి పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో 35 కిలోల గంజాయిని తరలిస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గంజాయి స్వాధీనం చేసుకొని స్టేషన్‌కు తరలించారు.

Tags:    

Similar News