40కిలోల గంజాయి పట్టివేత

దిశ, నర్సంపేట: మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని 40 కిలోల గంజాయితో పాటు బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్టు నర్సంపేట ఏసీపీ ఫణీందర్ తెలిపారు. శనివారం చెన్నారావుపేట పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. స్థానిక ఎస్సై రవి ఉదయం 8 గంటలకు చెన్నారావుపేట గ్రామ శివారులో వాహనాల తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పదంగా మోటార్ సైకిల్ మీద వెళ్తున్న ఓ వ్యక్తిని తనిఖీ చేయగా అతని దగ్గర 40 కిలోల గంజాయి […]

Update: 2020-07-18 07:53 GMT

దిశ, నర్సంపేట: మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని 40 కిలోల గంజాయితో పాటు బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్టు నర్సంపేట ఏసీపీ ఫణీందర్ తెలిపారు. శనివారం చెన్నారావుపేట పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. స్థానిక ఎస్సై రవి ఉదయం 8 గంటలకు చెన్నారావుపేట గ్రామ శివారులో వాహనాల తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పదంగా మోటార్ సైకిల్ మీద వెళ్తున్న ఓ వ్యక్తిని తనిఖీ చేయగా అతని దగ్గర 40 కిలోల గంజాయి లభ్యమైంది. అతడిని అదుపులోకి తీసుకొని తహసీల్దార్ కార్యాలయం ఎదుట విచారించగా మహారాష్ట్రలోని అచ్చలాపూర్‌కు చెందిన శశికాంత్ మోరేగా గుర్తించినట్టు తెలిపారు. గంజాయిని భద్రాచలం దగ్గర కొనుగోలు చేసి మహారాష్ట్రకు సరఫరా చేస్తున్నట్టు నిందితుడు తెలిపాడు. గంజాయి విలువ 1,80,000 ఉంటుందని, నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్టు ఏసీపీ తెలిపారు. వాహన తనిఖీల్లో ప్రతిభ కనబర్చిన హోంగార్డు సురేష్‌ను ఏసీపీ అభినందించి రివార్డు అందించారు.

Tags:    

Similar News