డోలపేటలో ఉద్రిక్తత… లాఠీ ఛార్జ్!

శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం డోలపేటలో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. పోలీసుల, గ్రామస్థుల మధ్య వాగ్వాదం లాఠీచార్జ్‌కి దారితీసింది. దాని వివరాల్లోకి వెళ్తే, కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా విధించిన లాక్‌డౌన్‌కు వలస కార్మికులు వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అలా చిక్కుకున్న వారిని ప్రభుత్వం స్వస్థలాలకు పంపుతోంది. ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లాలోని రావులపాలెం నుంచి నాలుగు బస్సుల్లో 200 మంది కార్మికులను డోలపేటకు తరలించారు. అయితే ఇలా చేరుకున్న వారందర్నీ నేరుగా […]

Update: 2020-05-01 02:45 GMT

శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం డోలపేటలో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. పోలీసుల, గ్రామస్థుల మధ్య వాగ్వాదం లాఠీచార్జ్‌కి దారితీసింది. దాని వివరాల్లోకి వెళ్తే, కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా విధించిన లాక్‌డౌన్‌కు వలస కార్మికులు వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అలా చిక్కుకున్న వారిని ప్రభుత్వం స్వస్థలాలకు పంపుతోంది. ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లాలోని రావులపాలెం నుంచి నాలుగు బస్సుల్లో 200 మంది కార్మికులను డోలపేటకు తరలించారు.

అయితే ఇలా చేరుకున్న వారందర్నీ నేరుగా వారి ఇళ్లకు తరలించకుండా ముందు జాగ్రత్త చర్యగా సమీపంలో క్వారంటైన్ చేయనుంది. ఈ క్రమంలో డోలపేటకు చేరుకున్న వీరిని స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఉంచారు. గ్రామం మధ్యలో ఉన్న స్కూళ్లో వారిని ఉంచడాన్ని గ్రామస్థులు అడ్డుకున్నారు. తమ నివాసాల మధ్య క్వారంటైన్ ఏర్పాటు చేయవద్దని అధికారులకు సూచించారు. వారిని అక్కడ ఉంచితే వారిలో ఎవరికైనా కరోనా ఉంటే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.

దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. అధికారులు, పోలీసులు కలిపి నచ్చజెప్పినప్పటికీ గ్రామస్థులు వారికి అక్కడ క్వారంటైన్ చేయడానికి అంగీకరించలేదు. దీంతో వారికి, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. ఈ క్రమంలో పలువురికి గాయాలయ్యాయి. వారిలో మహిళలు కూడా ఉన్నారు.

tags: quarantine, srikakulam district, ap, dolapeta, lathi charge

Tags:    

Similar News