కిడ్నాపర్లుగా మారిన పోలీసులు.. దొంగను కిడ్నాప్ చేసి

దిశ, వెబ్‌డెస్క్: ఓ ముగ్గురు వ్యక్తులు డబ్బు కోసం ఇంకో వ్యక్తిని కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసిన వ్యక్తి భార్య కు ఫోన్ చేసి రూ. 3 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో మహిళ ఆమె భర్త సోదరితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కిడ్నాపర్లు ఫోన్ చేయటంతో తన సోదరుడ్ని ఏం చేస్తారో అనే భయంతో తాను ఎలాగోలా కష్టపడి బంధువుల దగ్గర అప్పుచేసి ఎలాగోలా లక్ష రూపాయలు సేకరించానని, కానీ మాకు లక్ష రూపాయలు […]

Update: 2021-05-27 02:09 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఓ ముగ్గురు వ్యక్తులు డబ్బు కోసం ఇంకో వ్యక్తిని కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసిన వ్యక్తి భార్య కు ఫోన్ చేసి రూ. 3 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో మహిళ ఆమె భర్త సోదరితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కిడ్నాపర్లు ఫోన్ చేయటంతో తన సోదరుడ్ని ఏం చేస్తారో అనే భయంతో తాను ఎలాగోలా కష్టపడి బంధువుల దగ్గర అప్పుచేసి ఎలాగోలా లక్ష రూపాయలు సేకరించానని, కానీ మాకు లక్ష రూపాయలు కాదు..రూ. 3 లక్షలు ఇస్తేనే వదులుతామని డిమాండ్ చేస్తున్నారని పోలీసులకు ఫోన్ చేసి చెప్పింది. దీంతో అలర్ట్ అయిన పోలీసులు రంగంలోకి దిగారు. విచారణ చేపట్టి ఆ కిడ్నాపర్లను చూసి ఖంగుతిన్నారు. ఆ కిడ్నాప్ చేసింది వేరేఎవరో కాదు.. తమ డిపార్టుమెంట్ పోలీసులే అని తెలుసుకొని షాక్ అయ్యారు. సులువైన మార్గంలో డబ్బు సంపాదించడానికి పోలీసులే ఓ దొంగను కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేసిన ఘటన దేశరాజధాని ఢిల్లీ లో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే..

ఢిల్లీలోని జామియా నగర్ పోలీస్ స్టేషన్లో దారి దోపిడీ కేసులో నిందితుడిగా ఉన్న వరుణ్ అనే వ్యక్తిని కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. ఇక ఆ దుండగుల నుండి దొంగను హెడ్ కానిస్టేబుల్ రాకేశ్ కుమార్, అమీర్ ఖాన్‌ తో పాటు మరో కానిస్టేబుల్ కాపాడారు. అప్పుడే వారికి అడ్డదారిలో డబ్బులు సంపాదించాలనే కోరిక కలిగింది. వెంటనే వరుణ్ ని తమ పోలీస్ స్టేషన్ లోనే దాచిపెట్టి.. అతని భార్యకు ఫోన్ చేసి ననీ భర్తను కిడ్నాప్ చేశాం.. రూ.3 లక్షలు వెంటనే ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించారు. దీంతో బెదిరిపోయిన సదురు మహిళ, ఆమె వదిన ఇద్దరు కలిసి తమ బంధువుల వద్ద అడిగి లక్ష రూపాయలు సర్దుబాటు చేసి ఫోన్ కిడ్నాపర్ల ఫోన్ చేశారు. అయిదు వారు మాత్రం రూ. 3 లక్షలకు ఒక్క రూపాయి తగ్గినా వరుణ్ ని చంపేస్తామని బెదిరించడంతో.. దిక్కుతోచని పరిస్థితిలో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసుల విచారణలో పట్టుబడిన హెడ్ కానిస్టేబుల్ రాకేశ్ కుమార్ పోలీసుల వద్ద నిజం ఒప్పుకున్నాడు. దారి దోపిడీలో పట్టుబడ్డ వరుణ్ వద్ద ఉన్న రూ. 1.5 లక్షలు తీసుకోవడానికి ప్లాన్ వేశామని, త్వరగా డబ్బు సంపాదించాలనే కోరికతో ఇటువంటి తప్పుడు పనిచేశామని చెప్పాడు. ఈ ఘటన పై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులతో పాటు బాధితుడు వరుణ్ ని కూడా అరెస్ట్ చేసి అతని వద్ద ఉన్న రూ. 1.5 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటన ఢిల్లీలో సంచలనం సృష్టిస్తుంది. చట్టాన్ని కాపాడే పోలీసులే ఇలా దొంగలుగా మారితే ప్రజల పరిస్థితి ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

Tags:    

Similar News