భారీగా తెలంగాణ మద్యం పట్టివేత

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: కరోనా కట్టడికి విధించిన లాక్ డౌన్ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తమ నష్టాన్ని పూడ్చుకునేందుకు మద్యం ధరలను పెంచిన విషయం తెలిసిందే. అయితే ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే తెలంగాణ మద్యం కొంచం తక్కువ ధరకే లభిస్తోంది. దీంతో చాలా మంది ఏపీకి చెందిన వారు అడ్డదారిలో తెలంగాణ నుంచి మద్యాన్ని ఆంధ్రప్రదేశ్‌కు తరలిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలోని కర్నూలు సరిహద్దు ప్రాంతాల్లో మద్యం అక్రమ రవాణా పెరిగిపోవడంతో పోలీసులు ఈ ప్రాంతంలో నిఘా […]

Update: 2020-07-29 08:55 GMT

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: కరోనా కట్టడికి విధించిన లాక్ డౌన్ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తమ నష్టాన్ని పూడ్చుకునేందుకు మద్యం ధరలను పెంచిన విషయం తెలిసిందే. అయితే ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే తెలంగాణ మద్యం కొంచం తక్కువ ధరకే లభిస్తోంది. దీంతో చాలా మంది ఏపీకి చెందిన వారు అడ్డదారిలో తెలంగాణ నుంచి మద్యాన్ని ఆంధ్రప్రదేశ్‌కు తరలిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలోని కర్నూలు సరిహద్దు ప్రాంతాల్లో మద్యం అక్రమ రవాణా పెరిగిపోవడంతో పోలీసులు ఈ ప్రాంతంలో నిఘా పెంచారు. తాజాగా బుధవారం నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం మాదిమడుగు వద్ద తెలంగాణా మద్యం తరలించే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. మేళ్లచెరువు నుంచి కృష్ణానదిలో పడవల ద్వారా తరలిస్తున్న 4236 బాటిళ్ళ మద్యం పట్టుకున్నారు. వీటి విలువ సుమారు ఆరు లక్షల రూపాయల విలువైన తెలంగాణా మద్యం స్వాధీనం చేసుకోవడం జరిగింది. కృష్ణా జిల్లా చందర్లపాడుకు చెందిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Tags:    

Similar News