పంజాగుట్టలో క్రాస్ మసాజ్ సెంటర్ గుట్టు రట్టు

దిశ, క్రైమ్ బ్యూరో : పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళలచే క్రాస్ మసాజ్ చేయిస్తున్న వ్యవహారాన్ని పోలీసులు గుట్టు రట్టు చేశారు. సోమజీగూడ సెంట్రల్ కోర్టు అపార్టుమెంట్ లోని ఫ్లాట్ నెంబరు 403 లో ఎస్ బ్యూటీ స్పా  పార్లర్ పేరుతో క్రాస్ మసాజ్ చేస్తున్నట్టు పోలీసులు సమాచారం అందుకున్నారు. మసాజ్ చేసేందుకు తరుచుగా వారానికి, నెల రోజులుగా మసాజ్ చేసే యువతులను మార్చుతున్నట్టుగా పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ కుమార్ విశ్వసనీయ సమాచారం అందుకున్నారు. […]

Update: 2021-03-12 01:55 GMT

దిశ, క్రైమ్ బ్యూరో : పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళలచే క్రాస్ మసాజ్ చేయిస్తున్న వ్యవహారాన్ని పోలీసులు గుట్టు రట్టు చేశారు. సోమజీగూడ సెంట్రల్ కోర్టు అపార్టుమెంట్ లోని ఫ్లాట్ నెంబరు 403 లో ఎస్ బ్యూటీ స్పా పార్లర్ పేరుతో క్రాస్ మసాజ్ చేస్తున్నట్టు పోలీసులు సమాచారం అందుకున్నారు. మసాజ్ చేసేందుకు తరుచుగా వారానికి, నెల రోజులుగా మసాజ్ చేసే యువతులను మార్చుతున్నట్టుగా పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ కుమార్ విశ్వసనీయ సమాచారం అందుకున్నారు. వెంటనే దాడులు చేపట్టిన పోలీసులు ఎలాంటి అనుమతులు లేకుండా, చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

క్రాస్ మసాజ్ అంటే…

క్రాస్ మసాజ్ అంటే పురుషులకు మహిళలు లేదా మహిళలకు పురుషులు మసాజ్ చేయడం. సహజంగా చాలా నేచురల్ థెరపీ సెంటర్లలో ఫీమేల్ థెరపిస్టులు మగవారికి మసాజ్ చేస్తుంటారు. అయితే లీగల్ గా రిజిస్టర్ అయిన స్పాలలో ఫిమేల్ థెరపిస్ట్ మగవారికి మసాజ్ చేయడం నేరం కాదు. కానీ కొన్ని ఇల్లీగల్ స్పాలలో ఇలా క్రాస్ మసాజ్ పేరిట అనైతిక కార్యకలాపాలు నిర్వహిస్తుండటం చట్టరీత్యా నేరం.

Tags:    

Similar News